Happy Father's Day 2024: ఫాదర్స్ డే శుభాకాంక్షలు, కోట్స్, HD ఫోటోస్..


Happy Father's Day 2024 In Telugu: ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే ను జూన్ 16వ తేదీన జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ప్రతి ఒక్కరూ మీరు మీ తండ్రికి ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..

 

Happy Father's Day 2024 In Telugu: అమ్మ ప్రతి ఒక్కరికి 9 నెలలు మోసి జన్మనిస్తే.. నాన్న మాత్రం మన వేలు పట్టుకొని తన జీవితాన్ని మొత్తం ధారపోస్తాడు. జీవితాంతం ఎలాంటి స్వార్థం లేకుండానే నాన్న మనకు బతుకు మార్గాన్ని చూపెడతాడు. కాయ కష్టం చేసి తన జీవితాన్నంత విద్యాబుద్ధులకు ఖర్చు చేసి  బిడ్డల ఎదుగుదలకు కీలక పాత్ర హోం ఇస్తాడు. ఎన్ని జన్మలెత్తినా ఆయన త్యాగాలు, కష్టాలు వెలకట్టలేనివే.. మన జీవితంలో ఇంతటి పాత్ర పోషించే నాన్నను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే ను జరుపుకుంటున్నాం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ప్రతి ఒక్కరు తన తండ్రికి తప్పకుండా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

1 /10

నా నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు! మీ ప్రేమ, సపోర్టుకు ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు. మీరు నాకు ఒక గొప్ప స్ఫూర్తి, నా జీవితంలో మీ ఉనికి చాలా అమూల్యమైనది.  

2 /10

ప్రతి ఒక్కరూ నాన్నలా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన అన్ని విషయాలకు మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను నాన్న. మీరు నాకు ఒక నిజమైన హీరో.  

3 /10

మీరు నాకు ఎల్లప్పుడూ కష్టసుఖాల్లో సపోర్టుగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతు నా జీవితాన్ని అద్భుతంగా మార్చాయి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..  

4 /10

నాన్న, మీరు నాకు ఒక గొప్ప గైడ్.. మీరు ఎల్లప్పుడూ నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మరో జన్మలో కూడా మీలాంటి నాన్న నాకు దొరకాలి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..  

5 /10

మీరు నాకు నేర్పించిన అన్ని జీవిత పాఠాలకు ధన్యవాదాలు నాన్న.. మీరు నాకు ఒక గొప్ప ఉపాధ్యాయులు, స్నేహితులు.. హ్యాపీ ఫాదర్స్ డే..  

6 /10

నాన్న, మీరు నాకు ఒక సపోర్ట్ ఐరన్ పిల్లర్ గా ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడినందుకు ధన్యవాదాలు. మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు!  

7 /10

మీరు నాకు ఒక గొప్ప స్ఫూర్తి, నాన్న. మీరు నా జీవితాన్ని అద్భుతంగా మార్చారు. మీలాంటి నాన్న జన్మలో నాకు కావాలి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..  

8 /10

మీరు నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి, నాన్న.. మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు!

9 /10

ఎన్నో కష్టసుఖాలతో మమ్మల్ని ముందుకు నడిపించి దారి చూపించిన నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను నాన్న .. హ్యాపీ ఫాదర్స్ డే..

10 /10

ప్రతి జన్మలో మీరే నాకు నాన్నగా ఉండాలని.. ఎప్పుడు నా ఉన్నతి కోసం కృషి చేయాలని కోరుకుంటూ.. హ్యాపీ ఫాదర్స్ డే ప్రియమైన నాన్నగారు..