Vidyabalan: సన్న జాజిలా మారిపోయిన డర్టీ పిక్చర్ హీరోయిన్.. ఆ సీక్రెట్ ఏంటని ఆరా తీస్తున్న ఫ్యాన్స్..


Bollywood actress vidyabalan: బాలీవుడ్ నటి ఒక్కసారిగా సన్నగా మారిపోయింది.  ఇటీవల విద్యాబాలన్.. 'చందు ఛాంపియన్' ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చి అందరిని షాకింగ్ కు గురిచేశారు. 

1 /7

నటి విద్యాబాలన్ బొద్దుగా కన్పిస్తుంటారు. కానీ ఈసారిమాత్రం ఆమె తన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.  ఇటీవల.. కార్తీక్ ఆర్యన్ 'చందు ఛాంపియన్' ప్రీమియర్ షోకి విద్యాబాలన్ బ్లాక్ డ్రెస్ వేసుకుని ప్రొగ్రామ్ లో పాల్గొన్నారు. ఆమె చాలా స్లిమ్ గా కన్పించారు.  

2 /7

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి తన దైన స్టైల్ లో అన్నిరకాల మూవీలో రాణించారు.  నటనలో ఉన్న తన టాలెంట్ తో..  2005లో 'పరిణీత'తో తెరంగేట్రం చేసింది. ప్రతి సినిమాలో తనదైన మార్కు చూపిస్తు అందరి చేత మన్ననలు పొందింది. 

3 /7

నిజానికి, కార్తిక్ ఆర్యన్ చిత్రం 'చందు ఛాంపియన్' ప్రీమియర్‌కి విద్యాబాలన్ తన సోదరి కొడుకుతో కలిసి వచ్చింది. విద్యాబాలన్ బ్లాక్ డ్రెస్ వేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఈవెంట్‌లో విద్యాబాలన్ డ్రెస్, ఆమె లుక్స్ అందరిని కట్టిపాడేశాయి.  ఆమె బరువు తగ్గడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

4 /7

విద్యాబాలన్ బ్లాక్ లాంగ్ డ్రెస్ వేసుకుని ఈ ఈవెంట్ కి వచ్చింది. మేకప్ కూడా ఎంతో సింపుల్గా వేసుకుంది. విద్యాబాలన్ తన జుట్టును పోనీ టైల్‌ స్టైల్ లో రెడీ అయ్యి వచ్చింది. విద్యాబాలన్ చాలా సన్నగా కనిపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

5 /7

విద్యాబాలన్ చివరిగా ప్రతీక్ గాంధీ సరసన 'దో ఔర్ దో ప్యార్' చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీతో పాటు ఇలియానా డిక్రూజ్, సెంథిల్ రామమూర్తి కూడా నటించారు. 

6 /7

విద్యాబాలన్ రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ, నటి 'భూల్ భూలయ్యా 3'లో కనిపించనుంది. ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు కార్తీక్ ఆర్యన్, తృప్తి దిమ్రీ కూడా నటిస్తున్నారు. ఈ కామెడీ థ్రిల్లర్ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రానుంది. 

7 /7

2007లో విడుదలైన మొదటి 'భూల్ భూలయ్యా'లో విద్యాబాలన్ కూడా ఒక కీ రోల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్‌తో పాటు అక్షయ్ కుమార్, షైనీ అహుజా, అమీషా పటేల్ లు నటించారు.