Pawan on Major Movie: దూసుకెళ్తున్న మేజర్ మూవీ..చిత్ర బృందానికి పవన్ అభినందనలు..!

Pawan on Major Movie: అడివి శేష్‌ హీరోగా నటించిన మేజర్ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌కు సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా మేజర్‌ సినిమాపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 12, 2022, 06:13 PM IST
  • సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న మేజర్ మూవీ
  • ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా సినిమా
  • తాజాగా పవన్‌ కళ్యాణ్ అభినందనలు
Pawan on Major Movie: దూసుకెళ్తున్న మేజర్ మూవీ..చిత్ర బృందానికి పవన్ అభినందనలు..!

Pawan on Major Movie: అడివి శేష్‌ హీరోగా నటించిన మేజర్ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌కు సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా మేజర్‌ సినిమాపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.

Pawan on Major Movie: మేజర్ చిత్ర బృందానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై  అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. ముంబైలో 26/11 మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. దేశం కోసం మేజర్ ఉన్ని కృష్ణన్ చేసిన సాహసాలు అందరికీ తెలియాలని తెలిపారు.

అన్ని భాషల్లో మెప్పిస్తున్న ఈబయోపిక్‌ ..తెలుగులోనూ రావడంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో ఉండటం వల్ల మేజర్ సినిమాకు ఇంకా చూడలేదని చెప్పారు. ఈ మూవీకి వస్తున్న ఆదరణ తన దృష్టికి వచ్చిందని..త్వరలో సినిమా చూస్తానన్నారు పవన్‌ కళ్యాణ్.  మేజర్ సినిమాలో అడివి శేష్ అద్భుతంగా నటించారని తెలిపారు. ప్రఖ్యాత రచయిత అడివి బాపిరాజు మనవడైన అడివి శేష్‌ అన్ని అంశాలపై అవగాహన ఉందన్నారు.

ఇలాంటి వారు చిత్రసీమకు మరింత మంది రావాలని ఆకాంక్షించారు. సాహస కథను చలన చిత్రంగా మలిచిన చిత్ర దర్శకుడు శశికిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలన్నారు. మేజర్ చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. మూవీలో ప్రకాష్‌ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మ అద్భుతంగా నటించారని అన్నారు.

Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!  

Also read:Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్ల రీఓపెన్..వెల్లడించిన మంత్రి సబితా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News