Ram Charan Game Changer : గేమ్ చేంజర్ సెట్స్ నుంచి లీక్.. గన్నుతో ఫైట్ మాస్టర్ ఫీట్స్

Game Changer Climax Shoot రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇందులో క్లైమాక్స్ షూటింగ్‌ను ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 03:49 PM IST
  • నెట్టింట్లో రామ్ చరణ్‌ సినిమాపై చర్చ
  • క్లైమాక్స్ షూటింగ్‌లో బిజీగా రామ్ చరణ్‌
  • రంగంలోకి దిగిన ఫైట్ మాస్టర్స్ అన్బరివ్
Ram Charan Game Changer : గేమ్ చేంజర్ సెట్స్ నుంచి లీక్.. గన్నుతో ఫైట్ మాస్టర్ ఫీట్స్

Game Changer Climax Shoot రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో రాబోతోన్న గేమ్ చేంజర్ సినిమా మీద ఆకాశన్నంటే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను శంకర్ గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికా, తైవాన్ అంటూ విదేశాల్లో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేశాడు శంకర్. ఇప్పుడు ఆ సినిమా యూనిట్‌కు కాస్త రెస్ట్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు.

తాజాగా ఈ మూవీ క్లైమాక్స్‌ను శంకర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ అన్బరివ్ స్లైలీష్‌గా గన్ను పట్టుకుని కనిపిస్తున్నాడు. అయితే ఇందులో శంకర్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఓ సారి పుణెలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చేశాడు. ఇక సాంగ్స్ కోసం అయితే భారీ సెట్లను వేశాడు. శంకర్ విజన్‌లో సాంగ్స్, ఫైట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ఆల్రెడీ గేమ్మ చేంజర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఓ డెబ్బై శాతం అయిపోయిందని, ఇంకా ముప్పై శాతం ఉందని, అది కూడా ఈ రెండు మూడు నెలల్లో అవుతుందని, తరువాతే ప్రమోషన్స్ మొదలుపెడతామని, రిలీజ్ డేట్ విషయంలో శంకర్‌దే ఫైనల్ నిర్ణయమని, అది దసరాకా? సంక్రాంతికా? అన్నది ఆయన ఇష్టమన్నట్టుగా దిల్ రాజు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

ఈ సినిమా కోసం దిల్ రాజు పెడుతున్న ఖర్చు, జరుగుతున్న బిజినెస్ గురించి వచ్చే రూమర్లే అందరినీ షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. ఈ సినిమాను దేశం మొత్తం నలువైపులా షూటింగ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. గోదావరి జిల్లాలు, వైజాగ్, రాయలసీమ, హైద్రాబాద్ చుట్టు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చార్మినార్ ఏరియాలో షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్‌ బర్త్ డేకు వదిలిన పోస్టర్, టైటిల్‌ ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే.

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News