Game Changer Shoot : గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయ్యేది అప్పుడేనట.. రిలీజ్ డేట్‌పై దిల్ రాజుకు నో క్లారిటీ

Game Changer Shoot And Release Date గేమ్ చేంజర్ సినిమా మీద ఇప్పుడున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శంకర్ రామ్ చరణ్‌ సంభవం మీద దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 10:57 PM IST
  • నెట్టింట్లో దిల్ రాజు కామెంట్లు
  • గేమ్ చేంజర్ సినిమా షూట్ అప్డేట్
  • రిలీజ్ డేట్‌ మీద దిల్ రాజు క్లారిటీ
Game Changer Shoot : గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయ్యేది అప్పుడేనట.. రిలీజ్ డేట్‌పై దిల్ రాజుకు నో క్లారిటీ

Dil raju Game Changer మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. శంకర్ తీస్తోన్న గేమ్ చేంజర్ సినిమా మీదున్న అంచనాలు, హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు దిల్ రాజు చేసిన కామెంట్లతో మరింత హైప్ పెరుగుతోంది. ఈ సినిమా ఎలా వస్తోంది.. ఎంత శాతం షూటింగ్ అయింది.. షూట్ ఎప్పుడు అవుతుంది.. రిలీజ్ ఎప్పుడు చేస్తారు? అనే విషయాల మీద దిల్ రాజు స్పందించాడు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు డెబ్బై శాతం అయిందని, ఇంకా ముప్పై శాతం ఉందని, అది కూడా ఆగస్ట్ లోపు అవుతుందని అనుకుంటున్నామని, ఆ తరువాత రిలీజ్ డేట్ గురించి శంకర్ చెబుతారంటూ.. అంతా ఆయనే చూసుకుంటారు అన్నట్టుగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈ కథలో గానీ, ఇతర విషయాల్లో గానీ దిల్ రాజు వేళ్లు పెట్టలేదట. అంతా శంకరే చూసుకుంటున్నాడట.

ప్రమోషన్స్ మాత్రం వేరే లెవెల్లో చేయబోతోన్నామని దిల్ రాజు తెలిపాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ స్టార్‌గా రామ్ చరణ్ మారిపోయాడని, శంకర్ సినిమాలకు ఇండియాలో క్రేజ్ ఉందని, తమ బ్యానర్‌ కూడా బాలీవుడ్‌లో మంచి పేరును తెచ్చుకుంటోందని ఇలా అందరం కలిసి ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాను నిర్మిస్తున్నామని దిల్ రాజు అన్నాడు.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

గత కొన్నేళ్ల నుంచి శంకర్ ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ ఉన్న సినిమాలు చేశాడు.. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రాపర్ కమర్షియల్ కథను సెట్ చేశాడని, అది అందరికీ సెట్ అవుతుందని, పాన్ ఇండియాగా సెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇందులోని పాటలు, ఫైట్స్ వేరే లెవెల్లో ఉన్నాయని, ఇప్పటి వరకు వచ్చిన పుటేజ్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? ఎప్పుడు వస్తుందనేది శంకర్ డిసైడ్ చేస్తాడన్నట్టుగా దిల్ రాజు తెలిపాడు.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News