Mahindra university: అనంద్ మహీంద్రా బీజీ పారిశ్రామికవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తాజా విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ప్రపంచాన్ని కుదిపేసే ఘటనలు మొదలుకుని.. చిన్న చిన్న విషయాలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న విషయం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ముఖ్యంగా ఇండియా విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడతున్న విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇద్దరు విద్యార్థులు అక్కడ మృతి చెందడం ఆందోళనలు మరింత పెంచింది.
వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకోగా.. అందులో ఎక్కువ మంది విద్యార్థులేనని తేలింది. వేలాది మంది విద్యార్థులు మెడికల్ విద్య కోసం ఉక్రెయిన్ వెళ్తుండటం గమనన్నట్లు నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. 18 వేల మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ వెళ్లినట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.
ఈ విషయంపై ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. 'ఇండియాలో మెడికల్ కాలేజీల కొరత ఉందని నాకు తెలీదు. మహీంద్రా యూనివర్సిటీలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే అవకాశం ఉందేమో పరిశీలిద్దామా?' అని టెక్ మహీంద్రా సీఈఓ చందర్ ప్రకాశ్ గుర్నానీ (సీపీ గుర్నానీ)ని ట్యాగ్ చేశారు.
I had no idea that there was such a shortfall of medical colleges in India. @C_P_Gurnani could we explore the idea of establishing a medical studies institution on the campus of @MahindraUni ? https://t.co/kxnZ0LrYXV
— anand mahindra (@anandmahindra) March 3, 2022
ఈ ట్వీట్‌పై నెటిజన్లు అనంద్ మహీంద్రాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరేమో దేశంలో మెడికల్ కాలేజీల కొరత లేదని చెబుతున్నారు. మరికొందరేమో ఇండియాతో పోలిస్తే ఆయా దేశాల్లో తక్కువ ఖర్చతో మెడికల్ విద్య పూర్తవుతున్న కారణంగా విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
Also read: Flipkart Mini Fridge: ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్.. రూ.3,000 ధరకే రిఫ్రిజిరేటర్ కొనేయండి!
Also read: OPPO Reno6 5G: ఒప్పొ రెనో6 ఫోన్‌పై రూ.22,210 వరకు డిస్కౌంట్- పూర్తి వివరాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook