Sankranthiki Vasthunnam OTT Streaming Date: 2025 యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Sankranthiki Vasthunnam OTT Streaming Date: తెలుగులో ఇపుడు సీనియర్ హీరోల హవా నడుస్తోందనే చెప్పాలి. ఈ కోవలో బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా ప్రముఖ ఓటీటీ భారీ రేటుకే కైవసం చేసుకుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకీ మామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు సోలో హీరోగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది.
ప్రస్తుతం థియేట్రికల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకీ మామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు సోలో హీరోగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. విడుదలైన ఐదు రోజుల్లో ఈ సినిమా రూ. 161 కోట్ల గ్రాస్ (రూ. 105 కోట్ల షేర్)రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు సోలో హీరోగా వెంకీ మామ తొలి రూ.100 కోట్ల గ్రాస్ తో పాటు రూ. 100 కోట్ల షేర్ సినిమాగా చెప్పొచ్చు.
తెలుగు సీనియర్ టాప్ హీరోల్లో చిరంజీవి తర్వాత రూ. 100 కోట్ల షేర్ అందుకున్నది వెంకటేష్ కావడం గమనార్హం. మొత్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో బాలయ్య ‘డాకు మహారాజ్’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. అంతేకాదు లాంగ్ రన్ లో ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ నుంచి రూ. 250 కోట్ల గ్రాస్ క్లబ్బుల్లో ప్రవేశించిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.