Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండవసారి విచారణకు అవినాష్ రెడ్డి, ఇవాళ అరెస్టు తప్పదా

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకోనుంది. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డిగా సీబీఐ భావిస్తున్న తరుణంగా ఇవాళ అతని అరెస్టు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అటు వైసీపీ వర్గాలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2023, 03:15 PM IST
Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండవసారి విచారణకు అవినాష్ రెడ్డి, ఇవాళ అరెస్టు తప్పదా

ఏపీ, తెలంగాణలో సంచలనంగా మారిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ప్రకంపణలు రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుపోతోంది. ఇవాళ రెండవసారి విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవచ్చనే సమాచారం వస్తోంది. 

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఇప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో సాక్షిగా వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఇప్పుడు నిందితుడిగా భావిస్తోంది. కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లో వివేకాను వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ఇవాళ సీబీఐ జారీ చేసిన సీఆర్పీసీ 160 నోటీసు ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి రెండవసారి విచారణకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్ సీబీఐ కార్యాలయం వద్ద కాస్సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత రంగంలో దిగిన పోలీసులు అందర్నీ అక్కడి నుంచి పంపించేశారు. 

ఇక ఈ కేసు విచారణపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే అంతకంటే దారుణం మరొకచి ఉండదన్నారు. ఈ కేసు విచారణ అంతా బీజేపీలోని చంద్రబాబు కోవర్టుల అండతో జరుగుతోందని..ఇందులో రాజకీయ కుట్ర అనుమానాలున్నాయని సజ్జల ఆరోపించడం సంచలనంగా మారింది. సజ్జల నోటి నుంచి ఈ మాటలొచ్చాయంటే..కచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్టు ఉంటుందని తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతల్లో చాలా ఆందోళన నెలకొందని తెలుస్తోంది.

సజ్జల ఏమన్నారు

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధమున్నట్టు ఏ విధమైన ఆదారాల్లేవన్నారు. ఎన్నికలకు ముందే వివేకా హత్యతో తమ నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డికి సంబంధాలున్నట్టు ఆధారాలున్నాయని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. కొందరినే టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. బీజేపీలోని కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. 

Also read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News