/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Chandrababu On CM Jagan: ముసుగు వీరుడు పరదాలు దాటి బయటకు వస్తున్నాడని.. జగన్‍కు ఖాళీ వీధులు స్వాగతం పలకాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. జగన్‍కు ఏ ఒక్కరూ స్వాగతం పలకొద్దని.. జగన్‍కు సహకరిస్తే సీమకు అన్యాయం చేసినవారు అవుతారని అన్నారు. పలమనేరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ రాయలసీమ ద్రోహి అని.. ఆయనను స్వాగతించకూడదన్నారు. రాయలసీమకు రాకూడదని జగన్‍ను జనం అడ్డుకోవాలన్నారు. జగన్.. ఒక్కసీమ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. టీడీపీ 90 శాతం పూర్తిచేసినా.. ఈ ప్రభుత్వం 10 శాతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జగన్.. 102 ప్రాజెక్టులు రద్దు చేశారని మండిపడ్డారు.

Also Read: Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం ప్రమాదకరం.. భారీగా పడిపోయిన షుగర్‌ లెవల్స్‌తో ఆందోళనలో భార్య

"ఉమ్మడి చిత్తూరులో 25 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు. జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడు. పిడిగుద్దులు గుద్దాడు. ఒక్క సాక్షి పేపర్‍కు జగన్ వేల కోట్ల ప్రకటనలు ఇచ్చుకున్నాడు. సీమ ప్రాజెక్టులకు మాత్రం జగన్ సరిపడా నిధులు ఇవ్వలేదు. జగన్‍ను ఇంటికి పంపేందుకు మేము సిద్దం. హంద్రీనీవాను పూర్తి చేశాను.. సీమకు నీళ్లు వచ్చాయి. గండికోట పూర్తి చేసి పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చా. చిత్తూరు జిల్లాలో జగన్ ఒక్క చెరువుకైనా నీళ్లు ఇచ్చారా..? రాయలసీమను జగన్ పూర్తిగా నాశనం చేశాడు. ప్రజాగళాన్ని మొదటగా పలమనేరులోనే ప్రారంభించా. 

పలమనేరు మీటింగ్ సూపర్ హిట్.. ఎక్కడ చూసినా జనమే. పది రూపాయలిచ్చి వంద దోచేసే జలగ.. సంపద సృష్టిస్తాం.. సమాజానికి పంచుతాం. జనం గెలవాలంటే.. జగన్ దిగిపోవాలి. బీజేపీతో కలిసినందుకు జగన్ మమ్మల్ని విమర్శిస్తున్నారు. జగన్ ఐదేళ్లపాటు బీజేపీ సర్కారు బిల్లులకు మద్దతిచ్చారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారా..? రాష్ట్రం కోసం ఎన్టీఏలో చేరితే మమ్మల్ని జగన్ విమర్శిస్తున్నాడు. మేం గతంలో ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా మైనార్టీలకు అన్యాయం జరగలేదు. మైనార్టీల కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ తెలుగుదేశం.

పలమనేరులో మిస్బా కుటుంబాన్ని వైసీపీ నేతలు వేధించారు. వైసీపీ వేధింపులతో మిస్బా కుటుంబం వలస వెళ్లింది. మిస్బా వంటి మైనార్టీ అమ్మాయిలు చదువుకోవడమే నేరమా..? ఎవరు తప్పుచేసినా దండిస్తేనే దారికొస్తారు. తప్పుచేస్తే చూస్తూ ఊరుకుంటే పేట్రేగిపోతారు. ఎక్కడ భూములు కనిపించినా వైసీపీ నాయకులు వదలట్లేదు. ఆలయ భూములు కూడా కబ్జా చేస్తున్నారు. చివరికి ఇళ్లను కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుంది. రాయలసీమ.. ఒకప్పుడు రతనాల సీమ రాయలసీమ ఇప్పుడు ఎడారిగా మారే పరిస్థితి వచ్చింది.  పొలాలకు నీళ్లు రావట్లేదు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. సీమ సాగునీటి రంగంలో ఎన్టీఆర్ మార్పు తెచ్చారు. రాయలసీమకు నేనున్నానని ఎన్టీఆర్ ధైర్యం ఇచ్చారు. తెలుగు గంగ, హంద్రీనీవా, నగరి గాలేరును ఎన్టీఆర్ ప్రారంభించారు. సీమ ప్రాజెక్టులను టీడీపీ సర్కారు పరుగులు పెట్టించింది. టీడీపీ పెట్టిన పథకాలు అన్నీ జగన్ తీసేశారు. మీ బతుకుల్లో చీకటి నింపిన వ్యక్తులను గుర్తించండి.." అని చంద్రబాబు కోరారు.

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
TDP President Chandrababu Naidu Satirical Comments on CM Jagan Election Campaign kr
News Source: 
Home Title: 

Chandrababu Naidu: ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఖాళీ వీధులతో స్వాగతం పలకండి: చంద్రబాబు సెటైర్లు
 

Chandrababu Naidu: ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఖాళీ వీధులతో స్వాగతం పలకండి: చంద్రబాబు సెటైర్లు
Caption: 
Chandrababu Naidu
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఖాళీ వీధులతో స్వాగతం పలకండి: చంద్రబాబు సెటైర్లు
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Wednesday, March 27, 2024 - 18:14
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
353