AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 7 నెలలు కావొస్తోన్న ఇప్పటికీ ఒక్క హామిల్లో 3 ఉచిత సిలిండర్ల హామితో పాటు తక్కువ ధరకు మందుబాబులకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తామన్న హామిలను మాత్రమే అమలు చేసింది. తాజాగా మహిళలను ఎంతగానో ఊరిస్తూన్న ఫ్రీ బస్సు పథకాన్ని ఉగాది నుంచి అమలు చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం సాధ్యాసాధ్యాలపై ఏపీ క్యాబినేట్ మంత్రులతో పాటు కొంత మంది అధికారులు కర్ణాటకతో పాటు తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం ఎలా అమలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించారు.
అయితే కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం అంతగా వర్కౌట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సామాన్య జనాలకు బస్సుల్లో చోటు లేకపోవడం .. అన్ని బస్సుల్లో మహిళలే ప్రయాణించిండం వలన పురుష ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఫ్యామిలీతో కలిసి ఎక్కడైనా వెళదామంటే పురుషులకు పిల్లలకు సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ క్యాబినేట్ సమావేశంలో ఫ్రీ బస్సు పథకం అమలను ఎలా చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అన్ని బస్సుల్లో ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలా ? కేవలం పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే మహిళలు ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ కేబినేట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం వుంది. రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10 శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యే అవకాశం వుంది. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, వారి పనితీరు, తదితర అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.