COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 96 శాతం జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలలో ఏదైనా ఒకటి (Corona Symptoms) ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

Last Updated : Aug 6, 2020, 03:26 PM IST
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

ప్రపంచ దేశాలను పెను సవాలుగా మారిన కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్లు రూపొందుతున్నాయి. అయితే వ్యాక్సిన్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత ప్రాణనష్టాన్ని ఆపవచ్చునని వైద్య నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా కరోనా లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవని, 96 శాతం మంది జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలలో ఏదో ఒక సమస్య బారిన పడ్డారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఆప్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. AP: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

45శాతం మంది కరోనా పేషెంట్లు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు మూడింటిని ఎదుర్కొన్నారు. అయితే ఎక్కువ మందిలో కనిపించిన లక్షణం (Corona Symptoms)  దగ్గు అని గుర్తించారు. అయితే జలుబు వచ్చిన వారిలో మాత్రం లక్షణాలు తక్కువగా కనిపించడం గమనార్హం. Andhra Pradesh: ఒక్కరోజులోనే 5 వేలకు పైగా కరోనా కేసులు

దగ్గు తర్వాత అతి ఎక్కువ మంది కరోనా పేషెంట్లలో కనిపించిన లక్షణం (COVID19 Symptoms) జ్వరం. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రెండు నుంచి 14 రోజుల్లో జ్వరం వచ్చినట్లు గుర్తించారు. వరుసగా మూడు రోజులు శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్

దగ్గు, జ్వరం తర్వాత కరోనా సోకిన వారిలో అధికంగా గుర్తించిన మరో ముఖ్య లక్షణం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం. ఈ లక్షణాలున్న పేషెంట్లలో రోగ నిరోధక శక్తిని అందించే కణాలపై వైరస్ దాడి చేయడంతో పాటు శ్వాసనాళాల పనితీరును అడ్డుకుంటుంది. వీటితో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నట్లు తేలింది. శరీరంపై దద్దర్లు, రంగు మారడం లాంటి కొత్త లక్షణాలు కనిపించినట్లు యూకేకు చెందిన కింగ్స్ కాలేజ్ గుర్తించింది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

 

Trending News