మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం..

గుర్తు తెలియని దుండగులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెలుపల (Mahatma Gandhi Statue) మహాత్మా గాంధీ విగ్రహాన్ని గ్రాఫిటీ, స్ప్రే పెయింటింగ్‌తో ధ్వంసం చేసిన సంఘటన 

Last Updated : Jun 4, 2020, 05:02 PM IST
మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం..

న్యూఢిల్లీ: గుర్తు తెలియని దుండగులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెలుపల (Mahatma Gandhi Statue) మహాత్మా గాంధీ విగ్రహాన్ని గ్రాఫిటీ, స్ప్రే పెయింటింగ్‌తో ధ్వంసం చేసిన సంఘటన జూన్ 3 అర్ధరాత్రి (Washington DC)వాషింగ్టన్ డీసీలో చోటుచేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం (Ministry of External Affairs) విదేశాంగ శాఖకు సమాచారం ఇవ్వడంతో దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక చట్టం ప్రకారం ఫిర్యాదు చేయగా దర్యాప్తు జరుపుతోంది. మెట్రోపాలిటన్ పోలీసుల అధికారులు డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్, నేషనల్ పార్క్ ను పోలీసులు సందర్శించి విచారణ నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

Also Read: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి )

మే 25న మిన్నియాపాలిస్లో ఆఫ్రికన్-అమెరికన్ (jorge floyd) జార్జ్ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన సమయంలోనే మహాత్ముడి విగ్రహం ధ్వంసం చేయబడింది. కాగా ఈ నిరసనలు చాలా హింసాత్మకంగా మారాయి. అంతేకాకుండా పలువురి ప్రముఖ అమెరికన్ల స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. వాషింగ్టన్ DC లో, నిరసనకారులు చారిత్రాత్మక చర్చిని తగలబెట్టడంతో పాటు జాతీయ స్మారక చిహ్నం, (abraham lincoln) లింకన్ మెమోరియల్ వంటి ప్రధాన స్థలాల్లో దాడులకు పాల్పడ్డారు. 

Also Read: ప్రముఖ అగ్ర దర్శకుడు కన్నుమూత

వాషింగ్టన్ డీసీ(Washington DC)లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత మాజీ ప్రధాన మంత్రి (atal bihari vajpayee) అటల్ బిహారీ వాజ్‌పేయి 2000 సెప్టెంబర్ 16న అప్పటి అమెరికా అధ్యక్షుడు (billclinton) బిల్ క్లింటన్ సమక్షంలో అమెరికా పర్యటనలో ప్రారంభించారు. గౌతమ్ పాల్ రూపొందించిన ఈ విగ్రహం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఇచ్చిన బహుమతి. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఇంపీరియల్ రెడ్ బ్లాక్ అని, రూబీ రెడ్ పిలుస్తారు. మొదట్లో 25 టన్నుల బరువు ఉండగా దీన్నిఇప్పుడు 16 టన్నులకు తగ్గించబడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here 

Trending News