Corona Will Not Vanish: కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది: డబ్ల్యూహెచ్​ఓ నిపుణులు

Corona Will Not Vanish: కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తగిన జాగ్రత్తలతో కలిసి బతకడం నేర్చుకోవాలని చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 12:34 AM IST
  • కరోనాపై నిపుణల షాకింగ్ నిజాలు
  • కలిసి బతకడం నెర్చుకోవాలంటూ అభిప్రాయాలు
  • టీకాతో పాటు ఇతర జాగ్రత్తలూ అవసరమని సూచన
Corona Will Not Vanish: కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది: డబ్ల్యూహెచ్​ఓ నిపుణులు

Corona Will Not Vanish: కరోనా వైరస్ రోజు రోజుకు రూపాంతరం చెందుతూ విస్తరిస్తున్న తీరుపై నిపుణులో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ ఇక ఎప్పటికీ అంతమవదని రష్యాలోని వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రతినిధి మెలిటా (WHO on Corona virus) వుజ్నోవిక్​ పేర్కొన్నారు.

ఈ వైరస్​ అనేది సాధారణ జబ్బులా మారిపోతిందని.. వుజ్నోవిక్ యూట్యూబ్​ ఛానెల్​లో చెప్పినట్లు టాస్​ వార్తా సంస్థ తెలిపింది. వైరస్​ ఎప్పటికి అంతం కాదంటే దానర్థం.. మనమే దీనికి సంబంధించిన చికిత్స, వైరస్ బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందని వుజ్నోవిక్ (Corona latest news) అభిప్రాయపడ్డట్లు టాస్​ వివరించింది.

ఎలా జాగ్రత్త పడాలంటే..

ముఖ్యంగా మనం వైరస్​ వ్యాప్తి తీవ్రతను తగ్గించుకోగలగాలని వుజ్నోవిక్ తెలిపారు. 'వైరస్ త్వరగా వ్యాపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో వైరస్​లు పుట్టుకొస్తూనే ఉంటాయి' అని తెలిపారు.

అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) తీవ్రత తక్కువగానే ఉంటుందని నివేదకలు వస్తున్నాయని వుజ్నోవిక్​ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం ప్రమాదకరమని ఆమె స్పష్టం చేశారు.

టీకా మాత్రమే కాదు..

ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా మాత్రమే కాకుండా.. వివిధ జాగ్రత్తలు అవసమని వుజ్నోవిక్ తెలిపారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, సమూహాలుగా ఏర్పడకపోవడం, రద్ధిని నివారించడం వంటి జాగ్రత్తలు అవసరమన్నారు.

ష్యాలో గత 24 గంటల్లో 27,179 కొత్త కరోనా కేసులు, 723 మరణాలు నమోదయ్యాయి, దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10,774,304కు చేరుకుంది. మరణాలు 320,634కి చేరాయి.

Also read: Corona cases worldwide: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం- 32 కోట్లపైకి మొత్తం కేసులు!

Also read: Afghan Crisis: ఆఫ్గన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు.. కిడ్నీలు అమ్ముకుంటున్న పేదలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News