Movie Ticket Price: సినిమా టికెట్ల ధరల పెంపు విషయంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల మూవీ టికెట్స్ పెంపునకు థియేటర్లకు అనుమతినిస్తూ.. హైకోర్టు ఆదేశించింది. కరోనా సంక్షోభం కారణంగా జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చుకునేందుకు వీలుగా.. టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా అనుమతినివ్వాలని అంతకు ముందు థియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి.
‘అఖండ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’ తదితర బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచుతామని తెలిపాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల థియేటర్ యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి.
థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: TSRTC: ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం-ఛైర్మన్ బాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook