Telangana Covid-19 curbs : తెలంగాణలో కోవిడ్‌ ఆంక్షల గడువు పెంపు.. అప్పటి వరకు అమలు

Telangana government extended Covid-19 curbs : తెలంగాణలో కోవిడ్‌ ఆంక్షల గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్ సర్కార్. అప్పటి వరకు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌, తదితర వాటిపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 10:52 PM IST
  • తెలంగాణలో కోవిడ్‌ ఆంక్షల గడువు పెంపు
  • జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌, తదితర వాటిపై ఆంక్షలు
Telangana Covid-19 curbs : తెలంగాణలో కోవిడ్‌ ఆంక్షల గడువు పెంపు.. అప్పటి వరకు అమలు

Telangana government extended COVID-19 curbs bans rallies, mass gatherings till Jan 20 : దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Covid new variant Omicron) ప్రభావంతో కోవిడ్ కేసులు (Covid cases) తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల (COVID-19 curbs) గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 

కాగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు (Covid restrictions) కఠినతరం చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం అమలు అవుతోన్న కోవిడ్ ఆంక్షల ప్రకారం.. రాష్ట్రంలో ర్యాలీలు, (Rallies) పబ్లిక్ మీటింగ్స్‌ (Public Meetings‌) నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరి మాస్కు ధరించాలి. 

మాస్కు (Mask) ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై కూడా టీఎస్ సర్కార్ నిషేధం విధించింది. కోవిడ్‌ విజృంభన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ (Telangana Government) వెల్లడించింది.

కాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 48,583 కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. కొత్తగా 1673 పాజిటివ్‌ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 6,94,030కి చేరాయి. 

Also Read : AP Corona update: ఏపీలో పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 1,257మందికి పాజిటివ్!

అయితే గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పొలేదు. ఇక కోవిడ్ (Covid) వల్ల ఇప్పటి వరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పొయిన వారి సంఖ్య 4,042. తెలంగాణలో ప్రస్తుతం 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read : Family Suicide in Vijayawada: ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణమదేనా.. పోలీసుల చేతిలో సెల్ఫీ వీడియో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News