Telangana BJP: తెలంగాణలో కమలనాథుల దశ తిరిగేనా..?

Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్‌ను సక్సెస్‌ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 03:57 PM IST
  • తెలంగాణలో జోరు పెంచిన కమలనాథులు
  • అమిత్‌షా టూర్ సక్సెస్‌పై బీజేపీ నేతల దృష్టి
  • తెలంగాణ ప్రభుత్వంపై కమలనాథుల ఆగ్రహం
Telangana BJP: తెలంగాణలో కమలనాథుల దశ తిరిగేనా..?

Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్‌ను సక్సెస్‌ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర శనివారంతో ముగియనుంది. 

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగింపు సభ జరగనుంది. ఈసభకు కేంద్రమంత్రి అమిత్ షా రాబోతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. తుక్కుగూడ సభలో బీజేపీ నేతలు, శ్రేణులు భారీగా పాల్గొననున్నారు. సభను సక్సెస్ చేయడం ద్వారా అధికార పార్టీకి సవాల్‌ విసరాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే జనసమీకరణపై దృష్టి పెట్టారు. ప్రతి జిల్లా నుంచి జనం వచ్చేలా నేతలు ప్రణాళికలు వేశారు. టికెట్ ఆశిస్తున్న నేతలు సభను సవాల్‌గా తీసుకున్నారు. వారి పలుకుబడితో జనసమీకరణ చేస్తున్నారు.  మరోవైపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

మరోసారి కేంద్రమంత్రి అమిత్ షా రానుండటంతో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి. సభ వేదిక నుంచి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా ..సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఈసారి షా మాటలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ఆ పార్టీ నేతల్లోనూ జరుగుతోంది. గతకొంతకాలంగా టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఇరుపార్టీల మధ్య వార్ కొనసాగింది. 

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కమలనాథులు భావిస్తున్నారు. టీఆర్ఎస్(TRS) అవినీతినే అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్తోంది. తుక్కుగూడ వేదికగా ఇదే అస్త్రాన్ని బీజేపీ(BJP) నేతలు సంధించనున్నారని తెలుస్తోంది. తమకు ఓ అవకాశం ఇవ్వాలని..అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామంటున్నారు. మరి అమిత్ షా టూర్‌ ..తెలంగాణ బీజేపీకి ఎలాంటి జోష్ ఇస్తుందో చూడాలి..

Also read:Ben Stokes Falls: క్రీజులోనే కుప్పకూలిన బెన్ స్టోక్స్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Also read:CM Jagan Comments: వారు రాష్ట్ర ద్రోహులా..దేశ ద్రోహులా..? సీఎం జగన్ ఆగ్రహం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News