KTR Arrest: ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్..?

KTR Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ క్షనమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఇప్పటికే ఈ కేసులో హై కోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఏ క్షణంలోనైనా కల్వకుంట్ల తారక రామారావును అరెస్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 16, 2025, 08:31 AM IST
KTR Arrest: ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్..?

KTR Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో  ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ కావొచ్చు.  మాజీ మంత్రి కేటీఆర్‌ మరికాసేట్లో ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  గుర్తించింది. ఎఫ్ఈవోకు రూ.45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చింది. నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించనుంది.

ఇదే కేసులో  కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. తిప్పి తిప్పి అడిగారు.. విచారణకు పూర్తిగా సహకరించానని  చెప్పారు. ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమి లేదని తెలుసని.. ఇంకా తనపై వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు.

మరోవైపు కేటీఆర్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయడంతో ఏసీబీ తన దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ను ఏసీబీ విచారించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో మరోసారి విచారించాలని భావిస్తోంది. అలాగే కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. దాంతో కేటీఆర్‌ అరెస్ట్‌ అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News