7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల చెల్లింపు, కొత్త వేతన సంఘం స్థానంలో కొత్త విధానం ఇలా మూడు అంశాల్లో శుభవార్త అందనుంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా లాభపడనున్నారు.
7th Pay Commission: 8వ వేతన సంఘం స్థానంలో కొత్త వేతన విధానం ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త విధానంలోప్రైవేట్ ఉద్యోగులకు చెల్లించినట్టే పని ఆధారిత ఇంక్రిమెంట్లు ఉంటాయి. అంటే ఉద్యోగుల పనితీరుని బట్టే జీతాల పెంపు ఉంటుంది. జీతాల పెంపు మరింత పారదర్శకంగా, హేతుబద్ధంగా ఉండవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు ప్రకారం Aykryod ఫార్ములా అమలు చేయవచ్చు. కొత్త వేతన విధానంతో ఉద్యోగుల పనితీరు పూర్తిగా మారనుంది. పని తీరు ఆధారంగా ప్రతి ఏటా లబ్ది కలగనుంది.
అందుకే కొత్త వేతన విదానం ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు ఉన్నట్టే పనితీరు ఆధారంగా ఉండనుంది. ఉద్యోగుల పనితీరు ఆాధారంగా జీతం పెంపు ఉంటుంది. జీతాల పెంపు మరింత పారదర్శకంగా ఉంటుందని తెలుస్తోంది.
డీఏ పెంపు, పెన్షన్ పెంపుతో కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లాభపడనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు ఆలోచన కేంద్రానికి ఇప్పట్లో లేనట్టే తెలుస్తోంది.
జనవరి 2025కు కేంద్ర ప్రభుత్వం డీఏ 3 శాతం పెంచితే జీతభత్యాలు ఎంత పెరుగుతాయో చూద్దాం. డీఏ 3 శాతం పెరిగితే నెలకు జీతం 540 రూపాయలు ఏడాదికి 6,480 రూపాయలు పెరుగుతుంది. అయితే ఇది 18 వేలు కనీస వేతనం ఉన్నవారికి. కనీస వేతనం పెరిగే కొద్దీ జీతం మరింత పెరుగుతుంది. అటు పెన్షనర్లకు 9 వేలు కనీస పెన్షన్ ఉంటే నెలకు 270 రూపాయలు, 1,25,000 పెన్షన్ ఉంటే నెలకు 3,750 రూపాయలు పెరగనున్నాయి.
ఎప్పటిలానే ఈసారి కూడా జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో ఉండవచ్చు. డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో ఉన్నా జనవరి నుంచి ఎరియర్లు చెల్లించనున్నారు.
జూలై 2024 నుంచి డిసెంబర్ 2024 వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025 డీఏ ఎంతనేది నిర్ణయిస్తారు. ఇప్పటి వరకూ అంటే నవంబర్ వరకూ అందుబాటులో ఉన్న ఏఐసీపీఐ సూచీ ప్రకారం డీఏ 3 శాతం పెరిగి 56 శాతానికి చేరుతుందని అంచనా ఉంది.
ద్రవ్యోల్బణం, ఏఐసీపీఐ సూచీ ప్రకారం డీఏ ఎంతనేది నిర్ణయిస్తుంటారు. ప్రతియేటా జనవరి, జూలై నెలల్లో డీఏ పెంపు ఉంటుంది. అంటే ఏడాదికి రెండు సార్లు డీఏ సవరిస్తుంటారు.
గత ఏడాది అక్టోబర్ నెలలో దీపావళికి ముందు 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచింది. తిరిగి జనవరి నెలలో ఇప్పుడు పెంచాల్సి ఉంది. ప్రస్తుతం మొత్తం డీఏ 53 శాతంగా ఉంది. జనవరి నుంచి పెరగాల్సిన డీఏ పెంపు ప్రకటన త్వరలో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో చాలా గుడ్‌న్యూస్‌లు అందుకుంటారు. డియర్నెస్ అలవెన్స్ పెంపు, డీఏ బకాయిలు, కొత్త వేతన విధానం ఇలా చాలా ప్రయోజనాలు అందనున్నాయి. పెన్షనర్లకు కూడా భారీగా లబ్ది చేకూరనుంది.