New Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల మంజూరు ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ నెల 26వ తేదీన కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కేబినెట్ సిఫార్సులకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులకు లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్, జీహెచ్ఎంసీ కమీషనర్ కు పంపిస్తారు. అదే మండలస్థాయిలో అయితే ఎంపీడీవో, మున్సిపాలిటీ స్థాయిలో కమీషనర్ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. లబ్దిదారుల ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లోప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది.
అదే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సమీపంలోని మీ సేవా కేంద్రంలోలేదా మీ సేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. మీ సేవ సర్వీస్ ఫారమ్‌పై క్లిక్ చేస్తే వివిధ శాఖల అప్లికేషన్లు కన్పిస్తాయి. వీటిలో మీరు పౌర సరఫరాల శాఖను ఎంపిక చేయాలి. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు మీ పేరు, వయస్సు, జెండర్, తండ్రి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. కావల్సిన ఆధార పత్రాల్ని జత చేసి నిర్ణీత రుసుము చెల్లించి మీ సేవా కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తు చేసేందుకు రెసిడెన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
Also read: Cold Wave: తెలంగాణలో చంపేస్తోన్న చలి.. మరో రెండు రోజులు పాటు తీవ్రమైన చలిగాలులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.