Hindenburg Research will be closed: జనవరి 2023 లో అదానీ గ్రూప్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు చేసిన అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ షాప్ ఇప్పుడు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ స్వయంగా తెలిపారు. అండర్సన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ప్రకటన చేశాడు. ఈ సంస్థ ఎప్పటి నుంచో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఈమధ్యే భారత్ లో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థ అదానీ గ్రూప్ పై షార్ట్ సెల్లింగ్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అదానీ గ్రూప్ నే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సంస్థలపై ఆర్థిక పరిశోధనలు నిర్వహించి..అరోపణలు చేయడంతో సదరు కంపెనీల షేర్లు పతాళానికి పడిపోయాయి. షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభాలాను ఆర్జించడమే హిండెన్ బర్గ్ పని అన్నట్లుగా ఎన్నో పెద్ద పెద్ద పరిశోధనల రిపోర్టులను నివేదించింది. దీనినే ఆర్థిక రంగంలో మానవ నిర్మిత క్రుత్రిమ విపత్తుల్ని గుర్తించడం అని పేరు పెట్టుకుంది.
తాజాగా దీనిని రద్దు చేస్తున్నట్లు అండర్సన్ ఒక స్టేట్ మెంట్ కూడా రిలీజ్ చేశారు. హిండెన్ బర్గ్ మూసివేయడం వెనక ఎలాంటి అనారోగ్య కారణాలు లేవని..వ్యక్తిగత అంశాలు, భయాలు బెదిరింపులు లేవని తెలిపారు. 2017లో ఈ సంస్థను ప్రారంభించగా..హిండెన్ బర్గ్ పోరాటాలు, విజయాలు, ప్రయాణం గురించి ఎక్స్ లో ఎమోషనల్ పోస్టుచేశారు ఫౌండర్. తాము చేస్తున్న ఆలోచనలు, ప్రణాళికులు పూర్తి చేసిన రోజున మూసివేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోస్టు తెలిపారు.
ఇక 2017లో సంస్థను స్థాపించినప్పటి నుంచి మోసం, దుర్వినియోగం, అవినీతి ఇలా అన్నీ బహిర్గతం చేయంలో హిండెన్ బర్గ్ సక్సెస్ అయ్యింది. ఎన్నో సామ్రాజ్యాల్ని కదిలించింది. వాటిని కదిలించాలని మేము ముందుగానే అనుకున్నాము. దాంట్లో అదానీ గ్రూప్ కూడా ఒకటి ఉందని పేర్కొంది.
Also Read: Tax Saving Tips: పన్ను ఆదాకు చేయడానికి అద్భుతమైన చిట్కాలు ..ఇవి చేయండి చాలు
అదానీ గ్రూప్ క్రుత్రిమంగా షేర్లను పెంచుకుంటోందని..స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని 2023 జనవరిలో సంచలన ఆరోపణలు చేసింది. కొద్ది రోజుల్లోనే అదానీ భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ లక్షల కోట్లు పడిపోయాయి. అదానీ గ్రూప్ షేర్లన్నీ దాదాపు సగానికి పడిపోయాయి. ఈ సమయంలో ప్రపంచ కుబేరుల్లో ఆ దశలో రెండో స్థానానికి చేరుకున్న అదానీ..మళ్లీ సగానికిపైగా సంపదను కోల్పోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టును అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించినా..చాలా రోజుల పాటు అదానీ మాత్రం నష్టాలను అనుభవించారు.
అదానీ గ్రూప్‌తో పాటు, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ డోర్సేస్ బ్లాక్ ఇంక్. ఇకాన్స్ ఐకాన్ ఎంటర్ప్రైజెస్ వంటి అనేక పెద్ద సంస్థలపై నివేదికలను ప్రచురించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఈ మూడు కంపెనీల మొత్తం సంపద ఆ సంవత్సరం $99 బిలియన్లకు చేరుకుంది. కాగా ఈ గ్రూపుల లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 173 బిలియన్ డాలర్లు పడిపోయింది. ఆండర్సన్ తన పోస్ట్‌లో కంపెనీ ప్రయాణం, పోరాటాల గురించి చెప్పాడు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూడు వ్యాజ్యాలు, ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంది. హిండెన్‌బర్గ్ అభివృద్ధి చేసిన పరిశోధన, ప్రక్రియలను ఓపెన్ సోర్స్ చేసే ప్రణాళికలను కూడా ఆండర్సన్ పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter