మాజీ మంత్రి మరియు తెలంగాణలో కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థిగా చెలామణీ అయిన దానం రాజేందర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎందుకు రాజీనామా చేశారో తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. అదే లేఖను ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డికి కూడా పంపారు.
చాలాకాలంగా పార్టీలో ఉన్నా.. పార్టీ కార్యకలాపాలకు అంటీ ముట్టన్నట్టుగా ఉన్న నాగేందర్ ఇటీవలి కాలంలో పూర్తిగా దూరమయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి పదవిని తనకు చెప్పకుండా అంజనీ కుమార్ యాదవ్‌కి కట్టబెట్టడం కూడా నాగేందర్ కినుకకు కారణమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. తాజాగా దానం నాగేందర్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాగేందర్ గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కార్మికశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో మాత్రం దానం నాగేందర్ ఓడిపోయారు. 1994, 1999, 2004 సంవత్సరాల్లో మాత్రం అసిఫ్ నగర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సాఆర్ హయాంలో నాగేందర్ ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా