విశాఖపట్నంలో ఇటీవలే ఓ యోగా టీచర్ని హత్య చేసిన కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానాస్పదమైన రీతిలో కొందరు యువకులును పట్టుకోగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
విభజన హామీ చట్టాన్ని అమలుచేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. తెలుగు రాష్ట్రాలు త్వరలోనే శుభవార్త వింటాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు.
వైజాగ్ ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో బుధవారం నుంచి అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు జరగనుంది. 'ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమ్మిట్-2017' పేరిట మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సుకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇద్దరూ కలిసి సదస్సును ప్రారంభించనున్నారు. బుధవారం నుంచి జరిగే ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 61 మంది ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ వర్సిటీ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరుకానున్నారు. సదస్సు చివరి రోజు కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్‌గేట్స్ హాజరుకానున్నారు.
క్యాన్సర్ పై అందరికి అవగాహన ఉండాలి. అవగాహనతో క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష అన్నారు. శనివారం ఉదయం విశాఖలోని రామకృష్ణ బీచ్ లో 'క్యాన్సర్ అవేర్నెస్ వాక్' జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటి గౌతమి, బాలకృష్ణ పాల్గొన్నారు.
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ.. తూర్పు నౌకాదళం మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకు వేదికగా వైజాగ్ ముస్తాబవుతోంది. ఈనెల 16 వ తేదీన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేతులమీదుగా 'కిల్తాన్' జలప్రవేశం చేయనుంది. కేంద్రంలో రక్షణ శాఖ పగ్గాలు చేపట్టాక మొదటిసారి నిర్మలా సీతారామన్ వైజాగ్ కు వస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.