కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాలకు కేంద్రం సానుకూలం

విభజన హామీ చట్టాన్ని అమలుచేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. తెలుగు రాష్ట్రాలు త్వరలోనే శుభవార్త వింటాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు.

Last Updated : Nov 24, 2017, 03:25 PM IST
    • కడప, బయ్యారం ఉక్కు కర్మాగారంపై సమీక్ష
    • టాస్క్ ఫోర్స్ కమిటీ నెలరోజుల్లో నివేదిక
    • వైజాగ్ లో మరో ఉక్కు కర్మాగారం
కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాలకు కేంద్రం సానుకూలం

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. కడప, బయ్యారంలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సానుకులత వ్యక్తం చేసింది. పరిశ్రలమల ఏర్పాటు అంశంపై కేంద్ర పరిశ్రమలశాఖా మంత్రి  బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ  తెలుగు రాష్ట్రాలు త్వరలోనే శుభవార్త వింటాయన్నారు. విభజన హామీ చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఢిల్లీలో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిశారు. ఈ సందర్భంగా  విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప,బయ్యారంలో ఉక్కుకర్మాగారం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ ఈ మేరకు స్పందించారు. కాగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ- "విభజన హామీ చట్టాన్ని అమలుచేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ భేటీలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక తరహా అంశాల మీద చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఉక్కుపరిశ్రమల ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని.. కమిటీ ఇచ్చిన నివేదక ఆధారంగా ఉక్కుపరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. నివేదిక ఇస్తుంది. అయితే ఉక్కు నాణ్యత అధ్యయనానికి  కాస్త సమయం పడుతుందని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా మాట్లాడుతూ  సుజనా చౌదరి మాట్లాడుతూ- "కడప, బయ్యారంలలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో స్ఠానికులు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఉక్కుపరిశ్రమలతో పాటు పరిన్ని పరిశ్రమలు తెలుగురాష్ట్రాల్లో ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు

విశాఖలో మరో ఉక్కు కర్మాగారం

ఈ సందర్భంగా  ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ కేంద్రం వైజాగ్ లో మరో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోందని..దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి అందించిందని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతోనే వైజాగ్ లో మరో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలిపారు. 

Trending News