Newly married woman murdered brutally: నరసాయమ్మ ప్రతీరోజూ తన అన్న అప్పారావుతో ఫోన్లో మాట్లాడేది. శుక్రవారం ఉదయం నుంచి అతను ఫోన్ చేస్తున్నా ఆమె స్పందించట్లేదు. దీంతో అనుమానం వచ్చిన అప్పారావు... ఇంటికెళ్లి చూడగా... ఇంట్లో విగతజీవిగా కనిపించింది.
Man kills wife and commits suicide in Vishakaptnam: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమె తలపై డంబెల్‌తో కొట్టి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని కుంచుమాంబ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విశాఖ-అరకు మధ్య పర్యాటకానికి మరింత వన్నె తెచ్చేలా రైల్వేబోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది వరకు ఈ మార్గంలో ఒక అద్దాల కోచ్ మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేది. పర్యటకులు పెరుగుతున్న నేపథ్యంలో..మరో రెండు అద్దాల బోగీలు జత చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
COVID-19 vaccine clinical trials in Vizag విశాఖ: కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఆంధ్రా మెడికల్ కాలేజీ ( AMC ), కింగ్ జార్జ్ హాస్పిటల్స్ ( KGH )లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
fire accident at Vizag port | గత కొన్ని రోజులుగా ఏపీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ పోర్టు ట్రస్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఓ నౌక ఇంజిన్ నుంచి పోగలు వచ్చాయి.
విశాఖపట్నం వాసులను విషవాయుల లీకేజీ (gas leak at Sainar Life Sciences Pharma company) ఘటనలు వెంటాడుతూనే ఉన్నాయి. సముద్రం సరిహద్దున ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ నగరంలో.. విషవాయువుల లీకేజీలతో ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చిపడుతుందో ఏమోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
వివాదాస్పదంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో ఆంధ్రప్రదేశ్ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసు విచారణకు సహకరించాలని సైతం డాక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడిలో స్థానిక వైసీపీ నేతపై కత్తులతో దాడి జరిగింది( Attack on YSRCP leader). వైఎస్సార్సీపీ నేత, విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఎప్పుడూ అదృష్టం వెన్నంటిపెట్టుకుని ఉండే ఆ ప్రజా ప్రతినిధి ఏమయ్యారు ? మాజీ మంత్రిగానే కాకుండా... కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడున్నారు ? అవును ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ ( AP minister Avanthi Srinivas ) వేస్తున్న ప్రశ్నలివే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఓ మంత్రిగా అవంతి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనం కోసమేనని అనుకున్నా... వాస్తవానికి కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహాలివేని అనిపిస్తోంది. బహుశా అందుకే ఏపీ మంత్రి అవంతీ శ్రీనివాస్ సైతం ఈ వ్యాఖ్యలు చేశారేమో. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి మంత్రి అవంతీ ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ( Vizag gas leak ) తీవ్రంగా అనారోగ్యం బారిన పడిన బాధితులను చూసి తర్వాత ఇంకేం జరుగుతుందోననే ఆందోళన, భయం గ్రామస్తులను వెంటాడుతున్న నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామని మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా కింద అందించనున్నట్టు సీఎం వైఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు మంత్రుల బృందం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి బాధితులకు చెక్కులు అందించారు.
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు.
Vizag gas leak tragedy విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.