విశాఖపట్నంలో ఇటీవలే ఓ యోగా టీచర్‌ని హత్య చేసిన కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానాస్పదమైన రీతిలో కొందరు యువకులును పట్టుకోగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. బర్మాక్యాంప్‌కి చెందిన కొందరు కుర్రాళ్లు గతకొంతకాలంగా మద్యం దుకాణాల వద్ద ముసలివాళ్లను బెదిరించి డబ్బులు లాక్కోవడం... మహిళలను వేధించడం లాంటి పనులు చేసేవారు.
అయితే అలా వారు ఎందుకు తయారయ్యారన్న విషయాన్ని కూపీ లాగితే.. దండుపాళ్యం సినిమా చూశాకే తమకు నేరాలు చేయడం అలవాటైందని వారు చెప్పడం గమనార్హం. అయితే గతంలో వీరు చాలా సార్లు స్థానిక పోలీస్ స్టేషన్లకు వివిధ నేరాల మీద వచ్చినా.. అవన్నీ పెట్టీ కేసులే కావడంతో పోలీసులు వదిలేశారు. ఇప్పుడు వీరు హత్యలు కూడా చేస్తున్నారనే సమాచారం అందడంతో వీరి మీద నిఘా పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్లానింగ్ ప్రకారం పట్టుకున్నారు.
ఈ మధ్యకాలంలో సుపారీలు తీసుకొని మర్డర్‌లు చేయడానికి యువకులు అలవాటు పడుతున్నారని.. వీరిని కట్టడి చేయాలి అని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిని అనుమానంతోనే హత్య చేసిన పోలీసులు.. యోగా టీచర్ హత్యతో వీరికి ఎలాంటి సంబంధం ఉందని విషయంపై ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు.
ఏదేమైనా... యువకుల్లో నేర ప్రవర్తనను పెంచి పోషించడంలో సినిమాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని.. ఇలా వక్రమార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి శ్రీకారం చుట్టే యువకులను మొదట్లోనే కట్టడి చేయాలని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పోలీసులకు విన్నవించుకుంటున్నారు.