KTR About Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా.. కేంద్రం కుట్రలు చేసిన తీరుపైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు.
Thota Chandrasekhar Press Meet : ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయి. జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా.. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు అని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ గుర్తుచేశారు.
Visakha Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జనసేన పార్టీ గాలి తీసేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా ఢిల్లీలో రెండవరోజు కూడా కొనసాగింది. ధర్నాకు మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల్లో పోరాటానికి పిలుపునిచ్చింది.
Visakha steel plant: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమౌతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఢిల్లీకు చేరాయి. వైసీపీ ఎంపీలు మద్దతు ప్రకటించారు.
Vizag Steel Plant Issue: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా జరుగుతున్న ఉద్యమం ఇకపై మరింత ఉధృతం కానుంది. స్టీల్‌ప్లాంట్ ఉద్యమాన్నిత మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి వెల్లడించింది.
Vizag Steel Plant: ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు నినాదంతో ప్రారంభమైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఇప్పుడు ప్రాణవాయువు అందిస్తోంది. లాభసాటిగా లేదు..ప్రైవేటుపరం చేద్దామనుకున్న పరిశ్రమే ఇప్పుుడు ప్రాణవాయుువు సరఫరా చేస్తోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి నిరంతరాయంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది.
Vizag steel plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ని వ్యతిరేకిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశమంతా ఆక్సీజన్ లభించక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిత్యం 100 టన్నుల మెడికల్ ఆక్సీజన్‌ని (Oxygen crisis) ఉత్పత్తి చేస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.
దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Visakha steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మంత్రి అవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీను ఇరకాటంలో పడేసింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన బీజేపీకు స్టీల్ ప్లాంట్ విషయం అడ్డంకిగా మారింది. అందుకే కేంద్రంలోని పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
Ys jagan on Vizag Steel: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.