డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

వివాదాస్పదంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో ఆంధ్రప్రదేశ్ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసు విచారణకు సహకరించాలని సైతం డాక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

Last Updated : Jun 5, 2020, 03:58 PM IST
డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో గత నెల రోజులుగా సంచలనంగా మారిన డాక్టర్ సుధాకర్ కేసులో రాష్ట్ర హైకోర్టు (AP high Court) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడు, విశాఖ డాక్టర్ సుధాకర్ (Doctor Sudhakar)‌ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన తల్లి కావేరి బాయి గురువారం దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనుమతితో డాక్టర్ సుధాకర్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ కావొచ్చునని, అయితే సీబీఐ విచారణకు సహకరించాలని సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కరోనా కల్లోలం.. తాజాగా ఇద్దరు మృతి

 

గత నెల 16న డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మానసిక పరిస్థితి లేదని కేజీహెచ్ వైద్యులు నిర్ధారించిన తర్వాత ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్‌పై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాయడంతో సుమోటో పిల్‌గా పరిగణించారు.  నేటి రాత్రి చంద్రగ్రహణం.. మూడు గంటలకు పైగా అకాశంలో అద్భుతం

సుధాకర్ మానసిక స్థితి బాగోలేదంటూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసు సీబీఐకి అప్పగించారు.  సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, తన కొడుకును అక్రమంగా అరెస్ట్ చేశారని, కోర్టులో ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి గురువారం హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
  
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి

 

Trending News