Newly married woman murdered brutally: విశాఖ (Vishakapatnam) జిల్లా భీమిలి పరిధిలోని గోవుపేటలో దారుణం జరిగింది. ఓ నవ వధువును ఆమె భర్తే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతురాలి మెడ, కాళ్లకు తాడు కట్టి ఉండటం... ఛాతిపై వాతలు పెట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె భర్తకు మూఢనమ్మకాలు, మంత్ర, తంత్రాలపై ఆసక్తి ఎక్కువని... ఆ పిచ్చిలో పడే ఆమెను హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తగరపువలస వలందపేటకు చెందిన నరసాయమ్మ (26)కు పుక్కళ్లపాలేనికి చెందిన హరితో నెల రోజుల క్రితమే వివాహం (Marriage) జరిగింది. వివాహం తర్వాత ఇద్దరు గోవుపేటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. హరి స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ శుక్రవారం (డిసెంబర్ 17) ఉదయం నరసాయమ్మ ఇంట్లోనే శవమై కనిపించింది.
నరసాయమ్మ ప్రతీరోజూ తన అన్న అప్పారావుతో ఫోన్‌లో మాట్లాడేది. శుక్రవారం ఉదయం నుంచి అతను ఫోన్ చేస్తున్నా ఆమె స్పందించట్లేదు. దీంతో అనుమానం వచ్చిన అప్పారావు... ఇంటికెళ్లి చూడగా... ఇంట్లో విగతజీవిగా కనిపించింది. నరసాయమ్మ భర్త హరిని అప్పారావు నిలదీయగా అతని నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో అప్పారావు భీమిలి (Bhimili) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మూఢ నమ్మకాలే కారణమా..? :
అప్పారావు ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని (Dead body) పరిశీలించారు. ఆమె కాళ్లు, మెడకు తాడు కట్టి ఉండటం... ఛాతిపై వాతలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ హత్య వెనుక మూఢనమ్మకాల కోణం ఉండొచ్చుననే వాదన బలంగా వినిపిస్తోంది. నరసాయమ్మ భర్త హరి చాలాకాలంగా మంత్ర, తంత్రాలు మూఢనమ్మకాలు పాటిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. జరగబోయేది చెబుతానంటూ చాలామందితో చెప్పేవాడని అంటున్నారు. మూఢనమ్మకాల కారణంగానే నరసాయమ్మను హత్య (Brutal Murder) చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Video: సింహాన్నే చిత్తు చేసిన దున్న-కింగ్ ఆఫ్ జంగిల్‌కు చావుదెబ్బ రుచి చూపించిందిగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook