Indrakeeladri Landslide | తీవ్ర వాయుపీడన ప్రభావం కారణంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటంబాలకు రూ.50 లక్షల చొప్పున ( RS 50 Lakh To Vijayawada Swarna Palace victims family) ఏపీ మంత్రులు చెక్కులు అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇకనైనా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ( Swarna palace fire accident) ఘటన విషయంలో హీరో రామ్ వరుస ట్వీట్స్‌తో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసిన ఈ అంశంపై విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు ( Viajayawada CP Srinivasulu ) పరోక్షంగా స్పందించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada fire accident Death Toll | విజయవాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది.
విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan On Vijayawada fire accident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడలో భారీగా అగ్ని ప్రమాదం (Fire Accident In Vijayawada) సంభవించింది. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ( AndhraPradesh ) రోజురోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ను ( Coronavirus ) కట్టడి చేయడానికి ఏపి ప్రభుత్వం కట్టుడిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు స్వచ్ఛంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ లాక్డౌన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
COVID19 Positive Patient Travelled In RTC | 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లిన కరోనా సోకిన పేషెంట్ మరుసటిరోజు ఆర్టీసీ బస్సెక్కి ఇంటికి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు. కానీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది.
తానే దగ్గరుండి మరి అనారోగ్యంతో ఉన్న తన భర్తను కోవిడ్ (Covid-19 Hospital) ఆసుపత్రిలో చేర్చింది.. ఇంటికెళ్లి వచ్చి మరుసటి రోజు చూస్తే తన భర్త కనబడలేదు. దీంతో ఆమె తల్లడిల్లుతూ.. పది రోజుల నుంచి తన ఆచూకీ చెప్పండి అంటూ కనబడ్డ ప్రతీఒక్కరిని వేడుకుంది. చివరకు ఆ వృద్ధురాలికి భర్త ఆచూకీ దొరికింది కానీ.. ఆయన ప్రాణాలతో లేడు. దాదాపు తొమ్మిది రోజుల నుంచి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా విలపించింది.
Old Man Missing From Covid Hospital: అసలే వృద్ధుడు.. అనారోగ్యంతో ఉండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా మహమ్మారి లక్షణాలున్నాయని అక్కడి వైద్యులు చెప్పడంతో.. జూన్ 24న కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు నుంచి ఆ వృద్ధుడి జాడ కరువైంది.. సిబ్బంది తన భర్త ఆచూకీ గురించి చెప్పకపోవడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ వృద్ధురాలు పోలీస్‌స్టేషన్ మెట్లక్కింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడలో చోటుచేసుకుంది.
Ganja smuggling | విజయవాడ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదంమోపిన విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సోమవారం భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను (Ganja peddlers) పట్టుకున్నారు. గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలతో పాటు గుట్కా అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి టికె రమామణి ( IAS Ramamani ) గురువారం కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతకు గురైన రమామణి.. గురువారం సర్వ జన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రమామణి మృతి చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రమామణి స్వస్థలం.
ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులకు ( Coronavirus positive cases ) ఇంకా బ్రేకులు పడటం లేదు. శనివారం రాష్ట్రంలో కొత్తగా మరో 43 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది.
కుటుంబకలహాలు భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానదిలో దూకిన ఘటన బుధవారం విజయవాడలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో సహా ఇంట్లోంచి వచ్చేసి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన చేసినట్టు తెలిపారు. సోదాల్లో బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. త్రీ కేపిటల్స్ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిణామాలన్నీ గందరగోళంగా తయారయ్యాయి. నిన్నటికినిన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.