Vijayawada: కోవిడ్19 కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో భారీగా అగ్ని ప్రమాదం (Fire Accident In Vijayawada) సంభవించింది. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. 

Last Updated : Aug 9, 2020, 08:35 AM IST
  • విజయవాడ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం
  • కోవిడ్19 కేర్ సెంటర్‌గా వాడుతున్న హోటల్‌లో మంటలు
  • ప్రాణ భయంతో పరుగులు పెట్టిన కరోనా పేషెంట్లు
Vijayawada: కోవిడ్19 కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident In Vijayawada) జరిగింది. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ (Hotel Swarna Palace)లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ (Fire Accident) ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరికి కాలిన గాయాలైనట్లు సమాచారం. ఈ హాటల్‌ను రమేష్ ఆసుపత్రి కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు!

కరోనా కేర్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది ఆసుపత్రి సిబ్బంది సహా మొత్తం 40 మంది వరకు హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. COVID19 Symptoms: కరోనా ముఖ్యమైన లక్షణాలివే 

బాధితులను మెట్రోపాలిటన్ కోవిడ్ కేర్ సెంటర్, లబ్బీపేట సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులలో మంటలు వ్యాపించాయి. ప్రాణభయంతో కొందరు ఒకటో అంతస్తు నుంచి కిందకి దూకేశారు. పోలీసులు, సహాయక సిబ్బంది భవనంలో చిక్కుకుపోయిన వారిని కొందర్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
 

Trending News