అమరావతి: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులకు ( Coronavirus positive cases ) ఇంకా బ్రేకులు పడటం లేదు. శనివారం రాష్ట్రంలో కొత్తగా మరో 43 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 8,338 మందికి కోవిడ్-19 టెస్ట్ జరపగా.. అందులో 43 మందికి కరోనా సోకినట్టు తేలింది. అందులో కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు సర్కార్ వెల్లడించింది.
Also read : తెలంగాణలో మళ్లీ పెరిగిన COVID-19 పాజిటివ్ కేసులు
ఏపీలో పలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి, సమీక్షించేందుకు శుక్రవారమే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం శనివారం గుంటూరులో పర్యటించింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ కోవిడ్-19 నివారణ కోసం ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం అభినందించినట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..