Revanth Reddy Speech From Jadcherla Meeting: " తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాటనే మర్చిపోయారు. అందుకే తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారు " అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Revanth Reddy On ORR Bidding Issue: బీఆర్ఎస్ ప్రభుత్వం మరో దోపిడీకి తెరలేపిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
Revanth Reddy on Go No 111 Cancelation: జీవో 111 రద్దుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇది దుర్మార్గపు నిర్ణయమని.. కేసీఆర్ను కోసి కారం పెట్టినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో రద్దు వెనక కుట్ర ఉందన్నారు.
Revanth Reddy Fires On Cm KCR: సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను తాము బయటపెట్టామన్నారు. కర్ణాటకలో మోదీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్కు మనసు ఒప్పడం లేదన్నారు.
Revanth Reddy About Karnataka Elections Results 2023: కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 సీట్లు ఉంటాయి. వీటిల్లో అధిక శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి, ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు తెలంగాణ పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Talasani Srinivas Yadav comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు.
Revanth Reddy : టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశారు. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియమాకాలు చేపడతామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు.
Junior Panchayat Secretary Strike In Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన సమ్మెపై స్పందించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. వారిని రెగ్యులర్ చేయకుండా వేధించడం సరికాదన్నారు.
Priyanka Gandhi Speech: నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు.
Revanth Reddy Election Promises: యువత భవితే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎంవోలో మరో ఉత్తరాది వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ పీఆర్వోగా సంజయ్ కుమార్ ఝ అనే వ్యక్తిని నియమించారని అన్నారు. పూర్తి వివరాలు ఇలా..
KTR satires on Priyanka Gandhi: అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకా గాంధీ తన ఈ పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలన్నారు.
Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.