Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంపై స్పందించిన మంత్రి తలసాని

Talasani Srinivas Yadav comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో  వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2023, 12:26 PM IST
Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంపై స్పందించిన మంత్రి తలసాని

Talasani Srinivas Yadav comments on Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరుష పదజాలంతో నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయాలలో విమర్శలు సహజమే కానీ మరీ మంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఇలా మాట్లాడటం ఏంటనే రియాక్షన్ అన్ని వర్గాల నుంచి కనిపించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చూసిన జనం, రాజకీయ పార్టీలు ముక్కున వేలేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడిపై నోరు పారేసుకునే స్థాయి, హోదా మీకు లేవు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు.

రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో  వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలి కానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని.. కానీ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పాదయాత్ర సందర్భంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి అధికార పార్టీ నేతలపై అలా వ్యక్తిగత విమర్శలు చేయడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన భాషలో చేసిన విమర్శలు చూసి ఆవేదన చెందాననని.. ఆ ఆవేదనతోనే బాధ్యత కలిగిన మంత్రిగా నేను రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నాను అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. 

ఇది కూడా చదవండి : Revanth Reddy Election Promises: నిరుద్యోగ భృతి నెలకు రూ. 4 వేలు, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఇంకా..

రాజకీయ నాయకులు పార్టీలు వేరైనప్పటికీ విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదు అని రేవంత్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. ఇకనైనా నేతలు బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకుంటే బాగుంటుంది అని సూచించారు. విమర్శకు ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ తన వ్యాఖ్యలను తనే సమర్ధించుకునేలా చివర్లో మరో చురక అంటించారు. ఏదేమైనా మొత్తానికి రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన పరుష పదజాలం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చనియాంశమైంది. 

ఇది కూడా చదవండి : KTR satires on Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News