Revanth Reddy: ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు.. మరో దోపిడీకి తెర: రేవంత్ రెడ్డి

Revanth Reddy On ORR Bidding Issue: బీఆర్ఎస్ ప్రభుత్వం మరో దోపిడీకి తెరలేపిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 24, 2023, 01:55 PM IST
Revanth Reddy: ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు.. మరో దోపిడీకి తెర: రేవంత్ రెడ్డి

Revanth Reddy On ORR Bidding Issue: ఓఆర్ఆర్‌ను సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓఆర్ఆర్‌ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరో దోపిడీకి తెర తీసిందన్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందని.. 7,388 కోట్లలో 738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని అన్నారు. చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని.. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకుస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడారు. 

"లక్ష కోట్ల ఆస్తిని రూ.7,388 కోట్లకే కొల్లగొట్టిన కంపెనీ.. రూ.738 కోట్లు చెల్లించాలి. హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. హెచ్‌జీసీఎల్ ఎండీగా హడావుడిగా బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఓఆర్ఆర్ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఐఏఎస్ అధికారి ఉండాల్సిన పదవిని రిటైర్ అధికారికి ఎందుకు అప్పజెప్పారు..? ఐఆర్‌బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49 శాతం వాటా అమ్మేశారు. తేజరాజు, రాజేష్ రాజు కేటీఆర్ సింగపూర్ వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నారు..? అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు. అందుకే కేటీఆర్ గూడుపుఠానీ సమావేశాలు.

ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఇవ్వగానే సింగపూర్ కంపెనీ వచ్చింది. ఆ తరువాత షెల్ కంపెనీలు ముందుకొస్తాయి. షెల్ కంపెనీల వెనక ఉన్న రాజులు ఎవరో.. యువరాజులు ఎవరో తేలాలి. ఈ నెల 26వ తేదీలోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10 శాతం నిధులు చెల్లించాలి. లేకపొతే సంస్థ టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జరుగుతున్న తతంగంపై అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలి. అరవింద్ కుమార్ నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరు..? ఆయన కేవలం కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే తాబేధారా..? నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది. మజెల్స్ సంస్థ నివేదిక తప్పు అని తేలింది కదా.. 10 శాతం నిధులు చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు..?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే హెచ్‌ఎమ్‌డీఏ, హెచ్‌జీసీఎల్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చే వరకు అధికారులను నిర్బంధిస్తామన్నారు. జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇంత దారిదోపిడీ జరుగుతున్నా బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేయరని నిలదీశారు. బండి సంజయ్ ఓఆర్ఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదు..? అని అడిగారు.

Also Read: Jagananna Vidya Deevena Funds: గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి

Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచేదెవరు..? లక్నోతో ముంబై ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News