Revanth Reddy Fires On Cm KCR: కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లిందని.. ఈడీ, సీబీఐతో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన మోదీని కర్ణాటక ప్రజలు ఓడించారని అన్నారు. మోదీతో సహా కేంద్ర మంత్రులంతా కర్ణాటకలో మోహరించారని బుద్ధి చెప్పారన్నారు. జై భజరంగబలి, ముస్లిం రిజర్వేషన్లు, కులాల విభజన తెచ్చి కుట్ర పూరితంగా గెలవాలని ఒత్తిడి తెచ్చారని.. మోదీ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలని మోదీని ఓడించేందుకు అందరూ కలిసి వచ్చారని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన తీర్పును ప్రపంచం అభినందిస్తుంటే కేసీఆర్ మాత్రం గెలుపు గురించి ఆలోచించాల్సిన పనిలేదని మాట్లాడారని అన్నారు.
"మోదీని ఓడిస్తానని కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను మేం బయటపెట్టాం.. కర్ణాటక ప్రజల తీర్పును కేసీఆర్ అభినందిస్తారని అనుకున్నాం.. కాంగ్రెస్‌కు.. నాకు బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజల తీర్పును అభినందించారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఉండవని బండి సంజయ్ చెప్పిన మాటలనే కేసీర్ చెప్పారు. కర్ణాటకలో మోదీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్‌కు మనసు ఒప్పడం లేదు. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ అవసరం ఉందని అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు మోదీ నాయకత్వాన్ని సమర్ధించేలా ఉన్నాయి.
కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్‌స్ ఒకే తాను మొక్కలు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే వీడిపోయినట్లు నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటకలో హంగ్ తీసుకొచ్చి కేసీఆర్ చక్రం తిప్పాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు కేసీఆర్ నడుములు విరిగే తీర్పు ఇచ్చారు. కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి దశ, దిశ నిర్ణయించే తీర్పు. తెలంగాణ ప్రజల పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును అభినందిస్తున్నాం. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెతుకుని బతకాల్సి వచ్చేది. అన్ని రకాల త్యాగాలు చేసి ప్రజల కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.." అని రేవంత్ రెడ్డి అన్నారు.
మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పాటు చేయడం ద్రోహమా..? కేసీఆర్‌కు సీట్లు ఇవ్వడం, కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం ద్రోహమా..? అంటూ ప్రశ్నించారు. బీసీ జనాభా లెక్కించాలని కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకుందని.. బీసీ జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.
పార్లమెంట్‌లో బీసీ జనగణకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వివేక్, ఈటల, రాజగోపాల్ రెడ్డి, విశ్వశ్వేర్ రెడ్డి, కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీతో కలిశారని అన్నారు. కానీ బీజేపీ వారిని నమ్మదు.. వారు బీజేపీని నమ్మరన్నారు. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని.. ఇందుకోసం అందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ అభ్యున్నతికి పని చేయలనుకునేవారు కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
'ఓటమి ఖాయమని కేసీఆర్‌కు అర్థమైంది. అందుకే ఎమ్మెల్యేలపై నెట్టి ఓటమిని తప్పించుకోవాలని చూస్తున్నారు. రూ.200 కోట్ల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తారట. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలకు ఏం సంబంధం..? బీఆర్‌ఎస్ ఖాతాలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అభ్యంతరం లేదు. కేసీఆర్‌కు ఇవి చివరి రాష్ట్ర అవతరణ వేడుకలు. తరువాత జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే..' అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?
Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి