Congress Vijayabheri Yatra in Narsapur: బంగారు తెలంగాణ చేస్తామని.. బొందలగడ్డ తెలంగాణగా మార్చారని సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చారని అన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని నర్సాపూర్ బహిరంగ సభలో కోరారు.
Revanth Reddy Filed Nomination in Kodangal: కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. కొండంగల్ ప్రజలు అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో కొడంగల్‌లో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
Revanth Reddy Comments On CM KCR: మరోసారి కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేసినా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ఆ పార్టీని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు.
Revanth Reddy Fires on PM Modi And CM KCR: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిందన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ ఎద్దేవా చేశారు.
Congress Six Guarantee Schemes: అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని అన్నారు.
Revanth Reddy On One Nation One Election: జమిలి ఎన్నికల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Comments On CM KCR: కొడంగల్‌లో మరోసారి కేసీఆర్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలకు ఎవరికీ లేదనకుండా సాయం చేశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శవాలను వదలకుండా దోచుకునే రకం అని అన్నారు.
Revanth Reddy On Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ వాళ్లపై కేసులు పెట్టించారని.. తాము మహబూబ్ నగర్‌కు వస్తే వీపు చింతపండు అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి ముసుగులో పేదల భూములను బీఆర్ఎస్ గుంజుకుంటోందని మండిపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
Hyderabad Police Stopped Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసేందుకు ఆయన వెళ్లగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Revanth Reddy on Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామని చెప్పారని.. కానీ ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా.. అంటూ తప్పించుకున్నారని అన్నారు.
Revanth Reddy Speech at Yatra for Change: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ఆయన హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ అందిస్తామని ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
Revanth Reddy in Republic Day 2023 Celebrations: ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Revanth Reddy On BRS: సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Malla Reddy On Revanth Reddy: తెలంగాణలో అధికార , విపక్ష నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని రోజుల వరకు కారు, కమలం పార్టీలు నేతలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకోగా.. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలతో రాజకీయ రచ్చ రాజేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.