Congress Vijayabheri Yatra in Narsapur: నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి నర్సాపూర్ సభకు వేలాదిగా తరలి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ విజయభేరి యాత్రతో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. నర్సాపూర్‌ను చార్మినార్ జోన్‌లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. నర్సాపూర్ లంబాడి సోదరుల అడ్డా అని.. ఇక్కడ లంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. అధికారంలోకి రాగానే నర్సాపుర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది అన్నారు.
బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్ వన్ చేశానని చెబుతున్నాడని.. రైతుల ఆత్మహత్యల్లో, నిరుద్యోగ సమస్యల్లో తెలంగాణను నెంబర్ వన్ చేశాడని అన్నారు. తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారని ఫైర్ అయ్యారకు. అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటున్నాడని.. ఇందిరమ్మ రాజ్యం అంటే లండాలను ఎస్టీ జాబితాలో చేర్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో తండాల్లో.. మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చారని.. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచారని రేవంత్ రెడ్డి తెలిపారు. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కుతినేదని కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్‌గా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమేనని అన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మర్చిపోయారా..? అని నిలదీశారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్‌ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోందని.. రాచరిక పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందని.. ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి