Revanth Reddy on Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే.. కేసులో నిజానిజాలు నిగ్గు తేలవవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే సిట్‌ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీక్ గందరగోళం ఎక్కువైందన్నారు. మంత్రి కేటీఆర్‌ను భర్తరఫ్ చేయాలని.. లేదా విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 371 ప్రకారం తెలంగాణ పబ్లిక్ కమిషన్‌ను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉన్నా స్పందించడం లేదన్నారు. మంగళవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే.. 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్లో ప్రధాని సమాధానం ఇచ్చారని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నారని.. ఆయన మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. ఒక్క రోజులు ఇన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
'హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా..? ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి దగ్గర చేయాలి..' అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Tax Saving Tips 2023: ఇలా చేయండి.. రూ.12 లక్షల జీతంపై ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో.. 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మే 4 లేదా 5న సరూర్ నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామన్నారు. ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమన్నారు. అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందన్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.
Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్ అమలుకు నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook