Revanth Reddy Filed Nomination in Kodangal: కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజార్టీ తనకు కొడంగల్ ప్రజలు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని చెప్పారు. ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామని.. అందరికీ అండగా నిలబడి ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి అన్నారు.
"సిరిసిల్ల, సిద్ధిపేట ప్రజలు చేసుకున్న పుణ్యం ఏమిటి..? కొడంగల్ చేసిన పాపం ఏమిటి..? 2009లో మహబూబ్‌నగర్ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి పార్లమెంట్‌కు పంపితే వారినే మోసం చేశాడు. మహబూబ్‌నగర్‌కు తెలంగాణ వచ్చిన పదేళ్లలో కేసీఆర్ ఎందుకు న్యాయం చేయలేదు..? ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఉంటే కొడంగల్‌లో తేల్చుకోడానికి రమ్మంటే ఎందుకు స్పందించలేదు. కృష్ణా జలాలు పారించి ఉన్నా.. కోస్గిలో మహిళా కాలేజీ, ఇంజీనింగ్ కాలేజీలు కట్టించి ఉంటే.. కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మేవారు.
మీరు ఇచ్చిన బలంతో కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టాను. తెలంగాణ రాజకీయాల్లో కొడంగల్ ప్రజలకు గొప్ప అవకాశం వచ్చింది. ఇక్కడి సమాజం అంతా కూర్చొని ఆలోచించాలి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాది కాదు. కొడంగల్‌లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్‌కు అధ్యక్షుడే. ఈ అధ్యక్ష పదవి నా కోసం కాదు. కార్యకర్తలు, ప్రజల కోసం. నాకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు అండగా నిలిచారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ ఏమైనా అభివృద్ధి జరిగిందా..? మళ్లీ మిమ్మల్ని మోసం చేసేందుకే బీఆర్ఎస్ ఓట్లు అడుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మీ అందరిసైనా ఉంది." అని రేవంత్ రెడ్డి అన్నారు.
కొడంగల్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుండా మోసం చేసిన సన్నాసులు ఏ మొహంతో ఓట్లు అడుగుతారని ఫైర్ అయ్యారు. అన్ని సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే ఇస్తున్నారని.. కొడంగల్‌కు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. కొడంగల్‌ను దత్తత కాదు.. దమ్ముంటే ఇక్కడ పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరినా స్పందిలేదన్నారు. ఇక్కడ అభివృద్ధి చేయలేనందుకే తన సవాల్‌ను స్వీకరించలేదన్నారు. రాష్ట్ర ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు.. సీఎం కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నాయని.. ఇక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలు అని అన్నారు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook