తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై మరో మారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని విష జ్వరాల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు .ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ దున్నపోతు మీద వాన పడితే తోకయినా ఆడిస్తుంది..రాష్ట్రమంతా జరాలతో ఊగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందా? అంటూ ఎద్దేవ చేశారు. ఈ ట్వీట్ కు విషజ్వరాలపై వచ్చిన కథనానికి సంబంధించిన పేపర్ కటింగ్ ను జత చేశారు.
దున్నపోతు మీద వాన పడితే తోకయినా ఆడిస్తుంది,రాష్ట్రమంతా జరాలతో ఊగుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందా? @TelanganaCMO @TelanganaHealth @ts_health pic.twitter.com/n4koSGbcnN
— Revanth Reddy (@revanth_anumula) August 20, 2019
తెలంగాణలో చాలాచోట్ల ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం మే నెల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకుపైగా ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో పలు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల్లో కూడా ఆటంకాలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కేసీఆర్ తీరు ను ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు.