మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మూతపడిన మద్యం విక్రయాలు తిరిగి ప్రారంభం కానున్నాయని మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన అవగాహన లేకున్నా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలనిస్తూ పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌లో అల్లకల్లోలం చేస్తోంది. దేశంలో ఓ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,427కు చేరుకుంది.
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా మంగళవారం ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో చేరిన వలస కార్మికులు అక్కడ భారీ ఎత్తున ఆందోళన చేపట్టడం.. వారిని చెదరగొట్టేందుకు ముంబై పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌కి కారణం ఎవరని ఆరా తీసిన ముంబై పోలీసులు.. ఆందోళనకారులు బాంద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చేలా చేసిన టీవీ జర్నలిస్టు రాహుల్ కులకర్ణిని బుధవారం అరెస్టు చేశారు. ఇందులో రాహుల్ కులకర్ణి చేసిన నేరం ఏంటంటే.. లాక్ డౌన్ ముగుస్తుందని, ముఖ్యంగా అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయంటూ రాహుల్ కులకర్ణి ఓ వార్తా కథనాన్ని
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా దేశంలో లాక్డౌన్ (Lockdown) అమలులో ఉన్న నేపథ్యంలో రోజు వారీ కూలీలకు పనిలేకపోవడంతో వారు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటికొచ్చే పరిస్థితి లేదు.
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
మరాఠా ఉద్యమం వేళ్లూనుకున్న మహారాష్ట్రలో మరో ఉద్యమానికి తెరలేవనుందా.. ? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి గతంలో ఇతర రాష్ట్రాల వారిని తరిమికొట్టిన విధంగా.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి.. శరణార్థులుగా ఉంటున్న వారిని మహారాష్ట్ర నుంచి తరిమి కొట్టనున్నారు.
ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.
ఏదైనా ఆపదకాలంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే అది మన ప్రాణాలతో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలను రక్షిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షిర్డీ సాయి బాబా జన్మస్థలమైన పత్రిని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనపై షిర్డీ వాసులు తీవ్రం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సాయి బాబా బతికున్నంత కాలం షిర్డీలోనే గడిపాడని.. ఆయన జన్మస్థలం గురించి ఎప్పుడూ ఊసెత్తలేదని.. అటువంటప్పుడు ఇప్పుడు పత్రిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సర్కార్ ప్రకటించడం ఏంటంటూ షిర్డీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇదే విషయమై శనివారం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని జనవరి 19న బంద్ చేపడతామని షిర్డీ గ్రామ పంచాయతీ ప్రకటించింది.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. క్యాంపస్ లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు.
సుప్రీం కోర్టులో శివ సేన పిటిషన్ సంగతి ఇలా ఉండగానే మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.