షిర్డీ సాయి బాబా జన్మస్థలమైన పత్రిని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనపై షిర్డీ వాసులు తీవ్రం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సాయి బాబా బతికున్నంత కాలం షిర్డీలోనే గడిపాడని.. ఆయన జన్మస్థలం గురించి ఎప్పుడూ ఊసెత్తలేదని.. అటువంటప్పుడు ఇప్పుడు పత్రిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సర్కార్ ప్రకటించడం ఏంటంటూ షిర్డీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇదే విషయమై శనివారం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని జనవరి 19న బంద్ చేపడతామని షిర్డీ గ్రామ పంచాయతీ ప్రకటించింది.