సీఎం సెక్యురిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.

Last Updated : May 3, 2020, 01:00 AM IST
సీఎం సెక్యురిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా ముంబైలోని ధారావిలో కోవిడ్-19 కేసులు అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు ముంబై వీధులను పట్టి పీడించిన కరోనావైరస్ ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర సీఎం సొంత నివాసం 'మాతో శ్రీ' వరకు చేరింది. 

Also read : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు బాంద్రాలో మాతోశ్రీ అనే ప్రైవేటు రెసిడెన్స్ ఉంది. ఇటీవలే ఇక్కడ ఛాయ్ అమ్ముకునే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అప్పుడే మాతోశ్రీ బిల్డింగ్‌ని సీల్ చేసి శానిటైజ్ చేశారు. ఆ తర్వాత ఇదిగో ఇలా అదే బిల్డింగ్ ఎదుట విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బందిలోని ముగ్గురు పోలీసులకు శనివారం కరోనావైరస్ పాజిటివ్‌‌గా గుర్తించారు. భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకిన నేపథ్యంలో మిగతా వారిని కూడా అందరినీ క్వారంటైన్‌కి తరలించి వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News