అల్లా ఇచ్చిండు.. నేను పంచుతున్నా.. 800 మందికి ఆహారం పంచుతున్న ముస్లిం

కరోనావైరస్ (Coronavirus) కారణంగా దేశంలో లాక్‌డౌన్ (Lockdown) అమలులో ఉన్న నేపథ్యంలో రోజు వారీ కూలీలకు పనిలేకపోవడంతో వారు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటికొచ్చే పరిస్థితి లేదు.

Last Updated : Mar 27, 2020, 06:37 PM IST
అల్లా ఇచ్చిండు.. నేను పంచుతున్నా.. 800 మందికి ఆహారం పంచుతున్న ముస్లిం

కరోనావైరస్ (Coronavirus) కారణంగా దేశంలో లాక్‌డౌన్ (Lockdown) అమలులో ఉన్న నేపథ్యంలో రోజు వారీ కూలీలకు పనిలేకపోవడంతో వారు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటికొచ్చే పరిస్థితి లేదు. దినసరి వేతనం (Daily wages) లేక ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చేందుకు కొంతమంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆకలితో అలమటించే వారికి ఆపన్నహస్తం అందిస్తూ మానవత్వం (Humanity) చాటుకుంటున్నారు. 

Read also : Coronavirus in AP: ఏపీలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు

ముంబైలోని ఓ ముస్లిం కుటుంబం కూడా తమ చుట్టూ ఉన్న నిరుపేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. సొంతంగా ఆహారం వండించి తాము ఉంటున్న ప్రాంతంలోని నిరుపేదలకు పంచిపెడుతున్నారు ఇబ్రహీం అనే ఈ పెద్దాయన. ''నలుగురికి సాయం చేసే శక్తిని ఆ అల్లా మనకిచ్చినప్పుడు.. మనకు చేతనైన సహాయం మనం చేయాలి'' కదా అంటున్న ఇబ్రహీం ఎంతో మందికి ఆదర్శం. అందుకే తనకు ఉన్నంతలో ఓ 800 మంది నిరుపేదలకు ఆహారాన్ని వండి, పంచి పెడుతున్నట్టు ఇబ్రహీం తెలిపారు. 

Read also : సాహో ప్రభాస్.. కరోనాపై పోరాటానికి రూ4 కోట్ల భారీ విరాళం

లాక్ డౌన్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదోళ్ల పొట్ట నింపడం కోసం ఇబ్రహీం పడుతున్న తపన నిజంగా ఎంతో గొప్పది. ఈ పెద్దాయన పెద్ద మనసును అభినందించకుండా ఉండలేం. దేశం నలుమూలలా పేదోళ్ల ఆకలి తీర్చేందుకు నేనున్నానంటూ ముందుకొస్తున్న ఇలాంటి పెద్దోళ్లను చూసినప్పుడే మానవత్వం ఇంకా బతికే ఉందని అనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News