Journalist arrested: వలస కూలీల ఆందోళనకు కారణమైన జర్నలిస్ట్ అరెస్ట్

లాక్‌డౌన్‌‌కి వ్యతిరేకంగా మంగళవారం ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో చేరిన వలస కార్మికులు అక్కడ భారీ ఎత్తున ఆందోళన చేపట్టడం.. వారిని చెదరగొట్టేందుకు ముంబై పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌కి కారణం ఎవరని ఆరా తీసిన ముంబై పోలీసులు.. ఆందోళనకారులు బాంద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చేలా చేసిన టీవీ జర్నలిస్టు రాహుల్‌ కులకర్ణిని బుధవారం అరెస్టు చేశారు. ఇందులో రాహుల్ కులకర్ణి చేసిన నేరం ఏంటంటే.. లాక్ డౌన్ ముగుస్తుందని, ముఖ్యంగా అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయంటూ రాహుల్ కులకర్ణి ఓ వార్తా కథనాన్ని రాసి ప్రసారం చేయడమే ఆయన అరెస్ట్‌కు కారణమైంది. 

Last Updated : Apr 16, 2020, 09:25 AM IST
Journalist arrested: వలస కూలీల ఆందోళనకు కారణమైన జర్నలిస్ట్ అరెస్ట్

ముంబై: లాక్‌డౌన్‌‌కి వ్యతిరేకంగా మంగళవారం ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో చేరిన వలస కార్మికులు అక్కడ భారీ ఎత్తున ఆందోళన చేపట్టడం.. వారిని చెదరగొట్టేందుకు ముంబై పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌కి కారణం ఎవరని ఆరా తీసిన ముంబై పోలీసులు.. ఆందోళనకారులు బాంద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చేలా చేసిన టీవీ జర్నలిస్టు రాహుల్‌ కులకర్ణిని బుధవారం అరెస్టు చేశారు. ఇందులో రాహుల్ కులకర్ణి చేసిన నేరం ఏంటంటే.. లాక్ డౌన్ ముగుస్తుందని, ముఖ్యంగా అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయంటూ రాహుల్ కులకర్ణి ఓ వార్తా కథనాన్ని రాసి ప్రసారం చేయడమే ఆయన అరెస్ట్‌కు కారణమైంది. 

Also read: Coronavirus in AP: ఏపీలో కొత్తగా 23 కరోనా కేసులు, ముగ్గురు మృతి!

ఓ మరాఠీ టీవీ ఛానెల్లో ప్రసారమైన ఈ వార్తా కథనమే వందల సంఖ్యలో వలస కూలీలను మంగళవారం ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకునేలా చేసిందని  రాహుల్ కులకర్ణిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఆయనను అరెస్ట్‌చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ కష్టకాలంలో.. జనాన్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు వార్తలు రాసే వారిని, వదంతులు వ్యాపింపచేసేవారిని ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర పోలీసులు టీవీ జర్నలిస్ట్ అరెస్టు ఘటనతో తేల్చిచెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News