మేమేమి చేశాము నేరం.. సెక్స్ వర్కర్ ఆవేదన!

రోజువారీ కూలీలు,యాచకులు, సెక్స్ వర్కర్లు, కార్మికులు LockDown కారణంగా నరకయాతన, ఆకలి కష్టాలు అనుభవిస్తున్నారు.  

Last Updated : Apr 5, 2020, 09:12 AM IST
మేమేమి చేశాము నేరం.. సెక్స్ వర్కర్ ఆవేదన!

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. అయితే డబ్బున్న పరిస్థితి పరవాలేదు. కానీ రోజువారీ కూలీలు, దినసరి కార్మికులు, యాచకులు, సెక్స్ వర్కర్లు, చిన్నాచితకా పని చేసుకునే కార్మికులు లాక్‌డౌన్  (India LockDown) వేళ నరకయాతన అనుభవిస్తున్నారు.  కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్

కోటి విద్యలు కూటికొరకే అనే నానుడి అందరికీ తెలిసిందే. కాగా, లాక్‌డౌన్ కారణంగా తనకు పట్టెడన్నం దొరకడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఓ సెక్స్ వర్కర్ ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు మేం ఎలా బతకాలంటూ నాసిక్ జిల్లా భద్రకాళి ప్రాంతానికి చెందిన ఓ సెక్స్ వర్కర్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. దేశంలోని అందరు ప్రజలకు ప్రభుత్వం సహకరిస్తున్నట్లయితే మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదంటోంది.  ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తనలాంటి వారికి ఈ కష్టకాలంలో తోడ్పాడు అందించాలని కోరింది. ఆహారం దొరకపోవడంతో పిల్లలకు చనుబాలు కూడా ఇవ్వలేకపోతున్నామని తన ఆవేదనను ఏఎన్‌ఐ మీడియాకు తెలిపింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 3600 కరోనా కేసులు నమోదు కాగా, 90 మందికి పైగా కరోనా కాటుకు బలయ్యారు. మహారాష్ట్రలోనే అధిక కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News