India China Border News: LAC వద్ద చైనా రహస్యంగా తన బలాన్ని పెంచుకుంటోంది. దళాలను విస్తరిస్తూ.. ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా హెలిప్యాడ్లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలను మెరుగుపరచుకుంటోంది.
Renu Desai on Army ప్రస్తుతం చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తవాంగ్‌లో చైనా సైనికుల తుక్కు రేగ్గొడుతూ ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను ప్రదర్శించడంపై రేణూ దేశాయ్ వీడియో షేర్ చేసింది.
india vs china soldiers : తవాంగ్ సెక్టార్లో ఘర్షణ ఘటన 2020 జూన్‌లో లడఖ్‌లోని గల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను గుర్తుచేసింది. ఆనాటి ఘర్షణలో 20 మంది భారత్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
New China border law gives stamp of approval for PLA’s LAC actions: సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Galwan valley: ఇండియా చైనాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచిన ఘటన తూర్పు లఢాఖ్ సంఘటన. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ ఘటనలో చైనాకు అంత భారీ దెబ్బ తగిలిందా..అవునంటోంది ఆ న్యూస్ ఏజెన్సీ.
దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
పాకిస్తాన్, చైనా దేశాలతో యుద్దం తేదీలు ఫిక్స్ అయ్యాయంటూ బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారని సైతం స్పష్టం చేశారు.
భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ( China ) పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ (india) ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనికుడిని మంగళవారం రాత్రి ఇండియన్ ఆర్మీ అధికారులు చైనా అధికారులకు అప్పగించారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత్-చైనా ( India-China) మధ్య కొన్నినెలల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యపై ఇదు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యపై మంగళవారం పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్‌ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు.
లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) స్వయంగా లడాఖ్‌లోని లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు.
చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు.
Indo vs China faceoff: న్యూఢిల్లీ: ఇండో చైనా సరిహద్దులో ( Indo-China border ) ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా ఇరుదేశాలు కీలక అడుగు వేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఇరు దేశాల సైన్యం తూర్పు లడ్డాఖ్ ( East Laddakh ) నుంచి వెనక్కి తగ్గుతుందా అనేది గమనించాల్సి ఉంది.
న్యూ ఢిల్లీ: ఇండో చైనా సరిహద్దుపై ( LAC) పై మొహరించి ఉన్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. డ్రాగన్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకు వీలుగా 3 వేల 5 వందల కిలోమీటర్ల సరిహద్దుపై ఉన్న సైన్యానికి ఈ స్వేఛ్చనిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ( Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ( High level review meeting) నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.