India China faceoff: న్యూఢిల్లీ: భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల భారత్, చైనా మధ్య లడాఖ్‌లో సరిహద్దు ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంగళవారం జరిగిన క్వాడ్ దేశాల సమావేశంలో అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో (Pompeo) శుక్రవారం గై బెన్సన్ షో (Guy Benson Show) కు ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనాతో క్వాడ్ దేశాలతో ప్రమాదం నెలకొని ఉందని.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. Also read: Ram Gopal Varma: ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపండి
బలమైన ఆర్థిక వ్యవస్థలున్న క్వాడ్ దేశాలపై చైనా కుట్రలు రచిస్తోందని.. తెలిపారు. అమెరికా ఇప్పటికే డ్రాగన్ దేశం చేస్తున్న అరాచకాలను బయటపెట్టిందని పేర్కొన్నారు. అయితే.. మంగళవారం జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ (అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా) దేశాల ప్రతినిధులు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా తీరు.. అదేవిధంగా ఇరు దేశాల మధ్య ( india-china ) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. Also read: Vishal: ఆ నష్టాన్ని హీరో విశాల్ భరించాల్సిందే: మద్రాస్ హైకోర్టు
ఈ క్రమంలోనే నిన్న పాంపియో మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో, తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని వాస్తవాధీన రేఖ వెంట చైనా తీరు సరిగా లేదని.. కుట్రలు చేస్తోందని పాంపియో విమర్శించారు. సుమారు 60 వేల మంది చైనా సైనికులు ఉత్తర భారత సరిహద్దుల్లో మోహరించి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చైనాలోని కమ్యూనిస్టు పార్టీతో క్వాడ్ దేశాలకు ప్రమాదం పొంచినట్లు పాంపియో వెల్లడించారు. Also read: Harthras Case: హత్రాస్ బాధిత కుటుంబానికి భారీ భద్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe