Rajnath Singh: మంచు శివలింగాన్ని దర్శించుకున్న రక్షణ మంత్రి

భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్‌ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు.

Last Updated : Jul 18, 2020, 03:36 PM IST
Rajnath Singh: మంచు శివలింగాన్ని దర్శించుకున్న రక్షణ మంత్రి

Defence minister: న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్‌ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకోని భోలేనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( CDS ) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నారవణే ఉన్నారు. 

శుక్రవారం లడఖ్‌లోని లేహ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్ సింగ్ .. చైనా సరిహద్దు ఎల్‌ఏసీ వెంబడి ఉద్రికత్త పరిస్థితుల అనంతరం ప్రస్తుత సరిస్థితులపై త్రివిధ దళాధిపతులతో చర్చించారు. అదేవిధంగా శనివారం భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఎల్‌ఓసికి చేరుకుని రక్షణ, ఉగ్రవాదం తదితర విషయాలపై చర్చించారు. అయితే గత కొన్నిరోజుల నుంచి పాకిస్తాన్ నిరంతరం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ వస్తోంది. ఈ క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఫార్వర్డ్ పోస్ట్‌లో పర్యటించి సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. Also read: Vijay Mallya: భారత ప్రభుత్వానికి విజయ్ మాల్యా కొత్త ఆఫర్

అయితే.. కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైన్యం ఆపరేషన్ మొదలు పెట్టిన నాటినుంచి ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో జూలై  21 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకోవచ్చన్న సమాచారం మేరకు సైన్యం మరింత అప్రమత్తమైంది. అయితే ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను తుదముట్టించేందుకు సైన్యం భారీగా సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది.  Also read: Bharat Biotech: కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

Trending News