China new land border law: చైనా కొత్త ఎత్తుగడ, నూతన సరిహద్దు చట్టం అమలు

New China border law gives stamp of approval for PLA’s LAC actions: సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్​తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 07:55 PM IST
  • చైనా మరో ఎత్తుగడ
  • సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో కొత్త సరిహద్దు చట్టం
  • భారత్​తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం
 China new land border law: చైనా కొత్త ఎత్తుగడ, నూతన సరిహద్దు చట్టం అమలు

China passes new land border law amid military standoff with India: చైనా మరో ఎత్తుగడ వేసింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో కొత్త సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చుకుంది. సరిహద్దుల్లో చైనా (China) ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు ఆ చట్టంలో చైనా వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పనలతో పాటు సరిహద్దు రక్షణ.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు ఈ చట్టంలో తెలిపింది.

Also Read : India vs Pakistan LIVE Score Card: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ స్కోర్ అప్డేట్

ఇక సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం (China new land border law) భారత్​తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఇక చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వెల్లడించింది. అయితే 12 పొరుగు దేశాలతో చైనా సరిహద్దును నిర్ణయించుకున్నప్పటికీ.. భారత్, (India) భూటాన్​తో (Bhutan) మాత్రం చైనాకు సరైన సరిహద్దు లేదు. దీంతో భారత్, భూటాన్ దేశాలతో చైనా (China) ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Also Read : T20 World Cup IND vs PAK: రాహుల్‌, ధోనిలను బతిమలాడిన పాక్ అభిమానులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News